కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతబడడంతో జనాలు ఓటీటీ వేదికపై తమకు నచ్చిన వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలు కూడా చూసేస్తున్నారు. థియ్ఏటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియక చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలని ఓటీటీకి అమ్మేద్దామని డిసైడ్ అవుతున్నారు. థియేట్రికల్ రిలీజ్ లేకుండా డైరెక్ట్ ఓటీటీలో వచ్చిన కాడికి అమ్మేసుకుని తమ అప్పులు తీర్చేసుకుంటున్నారు.

 

 

 

కంటెంట్ బాగుంటే గనక ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ మంచి ఆఫర్లనే ఇస్తున్నాయి. అయితే థియేటర్ల కోసం నిర్మించిన సినిమాలని డైరెక్టుగా ఆన్ లైన్లో ఎలా రిలీజ్ చేస్తారంటూ థియేటర్ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. మీరిలా చేస్తే థియేటర్లు తెరుచుకున్నాక మా పవర్ ఏంటో చూపిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎక్కువ నష్టపోతుంది చిన్న సినిమా నిర్మాతలే.

 

 

చిన్న సినిమా నిర్మాతలు ఎక్కడెక్కడి నుండో అప్పు తెచ్చి మొత్తం డబ్బులని సినిమా మీదే పెడతారు. ఆ సినిమా రిలీజ్ అయితేనే వారికి డబ్బులు వస్తాయి. లేదంటే ఇంకా ఇంకా అప్పులోకి జారిపోతారు. అందుకే చిన్న సినిమా నిర్మాతలు మరో ఆలోచన చేయకుండా తమ సినిమాని ఆన్ లైన్లో అమ్మేసుకుంటున్నారు. థియేటర్ యాజమాన్యాలు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా ఖాతరు చెయ్యట్లేదు.

 

 


ఈ మేరకు మంచు మనోజ్ చిన్న సినిమాలని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. నేడు ఆయన పుట్టినరోజు కారణంగా ఇచ్చిన ఒకానొక ఇంటర్వ్యూలో సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయడంపై స్పందించాడు. చిన్న సినిమాలని రిలీజ్ చేయకుండా అలాగే ఆపితే, థియేటర్లు తెరుచుకోగానే వారికి ఫలానా సంఖ్యలో థియేటర్లు ఇస్తామని హామీ ఇస్తారా అని అడిగాడు. ఇన్ని రోజులు థియేటర్ల కాలం నడిచింది. ఇప్పుడు చిన్న సినిమాల కాలం నడుస్తుంది అంతే తేడా అని తేల్చేశాడు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: