ఈరోజు జరుగుతున్న జూనియర్  ఎన్టీఆర్ పుట్టినరోజు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తారక్ కు శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్విట్ చేస్తున్నారు. ఎందరో ఇండస్ట్రీ ప్రముఖులు జూనియర్ పొగుడుతూ స్పందిస్తూ ఉంటే వివాదాల రామ్ గోపాల్ వర్మ ఈరోజు చాలా విభిన్నంగా స్పందించాడు.  

 

ప్రస్తుతం వర్మ చేసిన ట్విట్ ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన టీజర్ రాలేదని  నిరుత్సాహంలో ఉన్న యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ కు విపరీతమైన జోష్ ను ఇస్తోంది. జూనియర్ ఫిజికల్ ట్రైనర్ లాయడ్ స్టీవెన్ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటోను షేర్ చేయడం. ఆ ఫోటో కొద్దిక్ష్నాలలోనే సోషల్ మీడియా లో వైరల్ కావడం తెలిసిన విషయమే.  

లాయడ్ స్టీవెన్ జూనియర్ ఫోటోను షేర్ చేస్తూ ‘ఇలా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ను మీరెప్పుడు ఇలా చూసి ఉండరు. సిక్స్ ప్యాక్‌ తో ఎన్టీఆర్ ఇలా ఉండేవారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఫోటోగ్రాఫర్ బాలీవుడ్‌ లో ఫోటోగ్రాఫర్ రత్నానీ ఈ ఫోటోను తీశారు. ఇది మీకు యంగ్ టైగర్ జన్మదిన కానుకగా అందిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్’ అంటూ ట్విట్ చేసాడు.   

 

లాయడ్ స్టీవెన్ షేర్ చేసిన ఎన్టీఆర్ సిక్స్‌ ప్యాక్ ఫోటోపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘వావ్.. మియా మాల్కోవాను చూసిన తర్వాత బెస్టెస్ట్ బాడీ ఎన్టీఆర్‌ ది మాత్రమే’ అంటూ ట్వీట్ చేశారు. ఇక్కడ మరో అడుగు ముందుకు వేసిన వర్మ ‘హేయ్ తారక్.. నా గురించి నీకు చాలా బాగా తెలుసు. నేను గే (స్వలింగ సంపర్కుడిని) కాదు. అయితే నీ ఫోటో చూసిన తర్వాత అలా మారిపోదామనే కోరిక కలిగింది. ఆ బాడీ ఎంట్రా నాయనా’ అంటూ వర్మ చేసిన త్విట్ లో కొద్దిగా బూతు కోణం ఉన్నా ఇప్పడు ఆ ట్విట్ జూనియర్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: