తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతకు మించి తన మంచి మనసుతో... తనదైన ఆటిట్యూడ్తో ఇంకెంతో మంది అభిమానుల ప్రేమ ను సంపాదించుకున్నారు  జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్నో  విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్  హీరోగా దూసుకుపోతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి మరి నటిస్తూ ఆ పాత్రకు ప్రాణం పోస్తూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్. తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. 

 

 ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో మైలురాళ్లుగా కూడా నిలిచిపోయాయి. ఇక మొన్నటికి మొన్న అరవింద సమేత అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి... తన రౌద్రమైన  నటనతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్  సినిమాలో నటిస్తున్నారు. సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ హీరోలు  అయినా జూనియర్ ఎన్టీఆర్,  రామ్ చరణ్ లు మొదటిసారి కలిసి నటిస్తున్నారు. అంతకుమించి  ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించడం ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది. 

 

 ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా ... ఈ పాత్రకు సంబంధించి ఇప్పటివరకు పలు లీకులు  వచ్చాయి కానీ చిత్ర బృందం నుంచి అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్  మాత్రం రాలేదు. అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజు జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి అప్డేట్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన అది కుదరలేదు. అయితే ఇప్పటికే చరణ్ ఫస్ట్ లుక్ విడుదలై  సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరి జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఇంకా ఎంత అద్భుతంగా ఉండబోతుంది అని ప్రేక్షకుల అంచనాలు వేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే ఏదో డిఫరెంట్ గెటప్ ఖచ్చితత్వం ఉంటుంది. మరి జూనియర్ ఎన్టీఆర్ పాత్ర  ఎలా ఉండబోతుంది. కండలు తిరిగిన దేహంతో తెలుగువాడి పౌరుషాన్ని ఎలుగెత్తి చూపే విధంగా జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉంటుంది అని  ప్రేక్షకులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: