జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న స్టార్ హీరో . నందమూరి నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా నుంచి మొన్న వచ్చిన అరవింద సమేత సినిమా వరకు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. టాలీవుడ్ లో  తన నటనతో తాతకు తగ్గ మనవడిగా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుని జూనియర్ ఎన్టీఆర్ అనే పేరుకు తెలుగు చిత్ర పరిశ్రమ అనే  పుస్తకంలో ఎన్నో పేజీలు లిఖించుకున్నాడు. ఇక నటన పరంగా జూనియర్ ఎన్టీఆర్ అందరికీ స్ఫూర్తి గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. 

 

 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి రాణించాలి  అనుకునే యువ హీరోలకి   జూనియర్ ఎన్టీఆర్ నటన ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్  టైమింగ్... జూనియర్ ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కాబట్టి. అయితే మొదటి సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ కు పోటీ ఇచ్చే అసలుసిసలైన నటుడు ఎవరు లేరు అని అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 అయితే మొదటి సినిమా నుంచి తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకుంటూన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ లోని అసలు సిసలైన నటున్ని  తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా మాత్రం టెంపర్  అనే చెప్పాలి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాలో  జూనియర్ ఎన్టీఆర్ నటన పిక్స్ లో ఉంటుంది. అంతకు ముందు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కి ఆ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ కి ఎంతో తేడా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇంత గొప్పగా జూనియర్ ఎన్టీఆర్ నటించాడు అనే భావన  కలుగుతూ ఉంటుంది. ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ కొత్తగా అని అనిపిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోతుంటారు ప్రేక్షకులు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ లోని అసలు సిసలైన నటున్ని  పరిచయం చేసిన సినిమా టెంపర్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: