సిరివెన్నెల సీతారామశాస్త్రి... తెలుగు సినిమా చరిత్రలో కళాతపస్వి అన్న పదానికి సరిపోయే మొదటి వరుస వ్యక్తులలో ఈయన ఒకరు. ఒక వ్యక్తిని మార్చడానికి కేవలం మాటలతోనే కాకుండా తన పాటలతో కూడా ఆలోచింప చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అని చెప్పవచ్చు... మన టాలీవుడ్ అగ్ర దర్శకుడు సీతారామ శాస్త్రి గారిని అభివర్ణించిన విధానం అమోఘం. ఒక అవార్డు ఫంక్షన్ లో ఆయన గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ... " ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన నిద్ర లేస్తాడు..., అలాగే ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు...., అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు..., ఆయన పదాలే ఆయన కిరణాలు..., అక్షరాలు అనే తూటాలు తీసుకొని ప్రపంచం మీదకు వేటకు బయలుదేరతాడు. మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలు సంధిస్తారు. ఓటమిని ఎప్పుడు ఒప్పుకోవద్దు అంటాడు. ఇవన్నీ ఎవరు అంటే ఒకే ఒక్కరూ సిరివెన్నెల సీతారామశాస్త్రి. 

 


సీతారామ శాస్త్రి గారి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి, సామర్థ్యాలు సరిపోవు. నాకు తెలిసిన పదాలు సరిపోవు. ఎందుకంటే ఆయన తొలి సినిమాల్లో ఒకటైన సిరివెన్నెల లోని ఒక పాట 'ప్రార్దిశ వేణియ పైన.. దినకర మయూఖ తంత్రుల పైన' విన్న వెంటనే తెలుగు డిక్షనరీ ఒకటి ఉంటుందని దాన్ని శబ్ద రత్నాకరం అంటారని ఆ రోజే తెలుసుకున్నాను అని తెలిపాడు. అంతేగాక ఆ పుస్తకాన్ని కొనుక్కుని వచ్చి ప్రార్దిశ అంటే ఏమిటి....?  మయూఖ అంటే ఏమిటి లాంటి విషయాలను తెలుసుకున్న అని తెలిపాడు.


నిజానికి ఒక పాటను అర్థమయ్యేలాగ రాయనవసరం లేదని, అర్థం చేసుకోవాలని అనే కోరికని కలిగించేలా ఉంటే ఒక తెలుగు పాట స్థాయిని పెంచిన వ్యక్తి సీతారామశాస్త్రిగారు అని ఆయన తెలిపాడు. కేవలం ప్రేక్షకులు ఇవి మాత్రమే చూస్తారని, ఇవి మాత్రమే అర్థం చేసుకుంటారని కాకుండా వారికి అర్థం చేసుకునేలా తపించి రచించిన రచయిత సీతారామ శాస్త్రి గారని తెలుపుతూ... ఇలాంటి పాటలు రాసి ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి అని ఆయనను మాట్లాడడం జరిగింది. 

 


నిజానికి త్రివిక్రమ్ చెప్పినట్లుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన అనేక పాటలను గమనిస్తే... అసలు తెలుగులో ఇన్ని పదాలు ఉన్నాయి అని ఈ రోజు తెలుగు మాట్లాడుతున్న మనకి ఎన్నో అనుమానాలు వస్తాయి అంటే నమ్మండి. అసలు మనం ఎప్పుడూ చూడని పదాలను అటువంటి వాటిని ఎంతో సులభంగా పాటగా సమకూర్చి ప్రజల పైకి సంధిస్తారు సీతారామశాస్త్రి గారు. నిజంగా ఆయనకి పాదాభివందనం.

మరింత సమాచారం తెలుసుకోండి: