జ‌న‌ని జ‌న్మ‌భూమితో తెలుగు చిత్ర‌సీమ పాట‌ల ప్రపంచంలోకి అడుగుపెట్టిన సీతారామశాస్త్రి.. సిరివెన్నెల సినిమాతో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిగా మారిపోయారు.. ఇక అప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా.. ఆయ‌న క‌లం నుంచి జాలువారిన పాట‌లు నిత్య‌నినూత‌నంగా వ‌ర్ధిల్లుతున్నాయి. తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేశాయి.. ఒక‌టా.. రెండా.. వంద‌ల పాట‌లు తెలుగు చిత్ర‌సీమ‌ను లాలించి, పాలించాయి. స్ఫూర్తి  పొందాల‌న్నా.. ప్రేర‌ణ పొందాల‌న్నా..క‌సితో ల‌క్ష్యం వైపు అడుగులు వేయాల‌న్నా.. మ‌న న‌డ‌వ‌డికను చ‌క్క‌దిద్దుకోవాల‌న్నా.. సీతారామశాస్త్రి పాట‌లు వింటేచాలు..! అంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించి మ‌న‌కు అందించారు ఆయ‌న‌. అంత‌టి మ‌హా ర‌చ‌యిత పుట్టిన రోజు ఈ రోజు! ఈ గాలి.. ఈ నేల అంటూ సాగే సిరివెన్నెల పాట‌కు పుల‌క‌రించని మ‌న‌సు ఉంటుందా..! ప‌ర‌వ‌శించ‌ని హృద‌యాన్ని ఊహించ‌గ‌ల‌మా..! ఇలా ఆయ‌న క‌లం నుంచి వంద‌ల పాట‌లు జాలువారాయి. ఇంత‌టి అద్భుత‌మైన సాహిత్యాన్ని సృష్టించిన సీతారామశాస్త్రి తెలుగుర‌చయిత‌కావ‌డం మ‌నంద‌రికీ ఎంతో గ‌ర్వ‌కార‌ణం.

 

ఆయ‌న పాట ఎన్నడు కూడా ఈ నేల‌ను, ఈ గాలిని మ‌ర‌వ‌లేదు.. ఆయ‌న పాట‌లో ఈ గాలి ప‌రిమ‌ళం గుబాళిస్తోంది. వంద‌ల సినిమాల‌కు అద్భుత‌మైన పాట‌ల్ని అందించిన ఆయ‌న ఎనాడు కూడా సాహిత్య‌సేద్యాన్ని ఆప‌లేదు. ఆయ‌న క‌లం నిత్య‌నూత‌నంగా వ‌ర్ధిల్లుతూనే ఉంది. తెలుగునేల‌పై ఆయ‌న క‌లం అపార‌మైన‌ సిరిసంప‌ద‌లను సృష్టించింది. ఆయ‌న క‌లం నుంచి జాలువారిన ప్ర‌తీపాట మ‌నిషి జీవ‌న‌గ‌మ‌నాన్ని తెలిపేదే. అందులోనూ ముఖ్యంగా తెలుగుద‌నం ప‌లుముకుని నిండుగా ఉంటుంది. విన‌సొంపుగా ఉంటుంది.. ఇంత అద్భుత‌మైన సాహిత్యాన్ని సృష్టించిన ఆయ‌న‌.. ఎన్నో అవార్డుల‌ను అందుకున్నారు. స్వ‌యంకృషి, స్వ‌ర్ణ‌క‌మ‌లం, సంసారం ఒక చ‌ద‌రంగం, శృతిల‌య‌లు ఇలా.. ఎన్నో సినిమాల‌కు.. మ‌రెన్నో సినిమాల‌కు ఆయ‌న అపూర్వ‌మైన పాట‌ల‌ను అందించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న అనేక అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు. ఆయ‌న ముందుముందు మ‌న‌కు మ‌రిన్ని అద్భుత‌మైన పాట‌లు అందించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుందాం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: