ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు.. 
ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు
నను గన్న నా వాళ్ళు నా కళ్ళ లొగిళ్ళు
నను గన్న నా వాళ్ళు నా కళ్ళ లొగిళ్ళు
ఈ గాలీ ఈ నేలా.. 
అంటూ తెలుగునేల‌పై సిరిసంప‌ద‌లు సృష్టించిన అద్భుత‌మైన సినీగేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి.. వంద‌లాది పాట‌లు ఆయ‌న క‌లం నుంచి జాలువారాయి. ప్ర‌తీ పాట‌లోనూ తెలుగుద‌నం ఉట్టిప‌డుతుంది.. ప్ర‌తీ పాట‌కూడా స‌మాజ‌హిత‌మే కోరింది.. ఆనాటి నుంచి నేటిదాకా ఆయ‌న ర‌చించిన పాట‌లు ప్రేక్ష‌కుల మ‌దిని పుల‌క‌రింప‌జేస్తూనే ఉన్నాయి. ఈ రోజు ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తెలుగు ప్ర‌జ‌లు ఆయ‌న పాట‌ల‌ను గుర్తుచేస‌కుని మురిసిపోతున్నారు. త‌న్మ‌య‌త్వంతో ఊగిపోతున్నారు. నిజానికి.. చెంబోలు సీతారామ శాస్త్రి జనని జన్మభూమి (1984) చిత్రానికి గీత రచయితగా అరంగేట్రం చేశారు. కానీ.. సిరివెన్నెల చిత్రంలోని తన పాటల తర్వాత మంచి గుర్తింపు పొందారు. ఆ సినిమా టైటిల్ సిరివెన్నెలా అతని పేరు ముందు చేరిపోయి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా స్థిర‌ప‌డిపోయారు. ఈ సినిమాలోని ప్ర‌తీపాట కూడా ఒక అద్భుత‌మ‌నే చెప్పాలి.

 

సీతారామ‌శాస్త్రి అందించిన సాహిత్యానికి త‌న సంగీతంతో కేవీ మ‌హాదేవ‌న్‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం తన గాత్రంతో ప్రాణం పోశారు. ఇక అప్ప‌టి నుంచి సీతారామ‌శాస్త్రి వంద‌లాది సినిమాల‌కు పాట‌లు అందించారు. ఆయ‌న క‌లం నుంచి జాలువారిన ప్ర‌తీపాట మ‌నిషి జీవ‌న‌గ‌మ‌నాన్ని తెలిపేదే. అందులోనూ ముఖ్యంగా తెలుగుద‌నం ప‌లుముకుని నిండుగా ఉంటుంది. విన‌సొంపుగా ఉంటుంది.. ఇంత అద్భుత‌మైన సాహిత్యాన్ని సృష్టించిన ఆయ‌న‌.. ఎన్నో అవార్డుల‌ను అందుకున్నారు. స్వ‌యంకృషి, స్వ‌ర్ణ‌క‌మ‌లం, సంసారం ఒక చ‌ద‌రంగం, శృతిల‌య‌లు ఇలా.. ఎన్నో సినిమాల‌కు.. మ‌రెన్నో సినిమాల‌కు ఆయ‌న అపూర్వ‌మైన పాట‌ల‌ను అందించి, ఆ సినిమాల విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప‌లుమార్లు నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు.. ఇత‌ర సాహిత్య అవార్డులు అందుకున్నారు. ఇలా త‌న పాట‌ల‌తో తెలుగునేల‌ను సుసంప‌న్నం చేస్తున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: