తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా అంతా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డంతో పాటు ఎన్టీఆర్ సినిమాల మెసేజ్‌ల‌తో మార్మోగుతోంది. ఈ క్ర‌మంలోనే 17 ఏళ్ల ఎన్టీఆర్ మ‌హిళా అభిమాని ఒక‌రు రాసిన పోస్టు ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతోంది. ఈ పోస్టు ఇలా ఉంది.      అన్నా..! నా చిన్నప్పుడు మా అన్నయ్య, మావయ్య సినిమాల గురించి మాట్లాడుకొనేటప్పుడు వాళ్ళ దగ్గర విన్నాను జూనియ‌ర్ ఎన్టీఆర్‌ అన్న పేరు...అప్పుడు నా వయసు 5 యేళ్లు....నేను సినిమాకు వస్తా అని మారాం చేస్తే వాళ్ళు నన్ను తీసుకెళ్లారు, అలా నేను చూసిన మొట్ట మొదటి సినిమా రాఖీ. అలా 5 యేళ్ళ వయసులో ఏర్పడ్డ మీ మీద అభిమానం తో నాకు ఊహ తెలిసాక మీ సినిమాలు చూశాక మీ అభిమానినీ అని గర్వంగా చెప్పుకుంటున్నాను. మీరు నటించిన యమదొంగ సినిమా నుంచి నాకు మీ అభిమానిగా ఒక ఇష్టం మొదలైంది. ఏ పాత్రలో అయినా అలవోకగా నటించే తీరు, మీరు డైలాగ్స్ చెప్పేటప్పుడు మీలోని హావభావాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 

మీ వాయిస్ లో ఉండే బేస్ మీ డైలాగ్స్ కి ఒక హుందాతనాన్ని ఇస్తుంది. ఇక మీ డాన్స్ గురించి అయితే మీరు అభిమాని కానీ వాళ్ళు బహుశా ఎవ్వరూ ఉండరు. ఇది నా ఒక్క అభిప్రాయం మాత్రమే కాదు, మీతో నటించిన చాలా మంది హీరోయిన్స్ మీ డాన్స్ గురించి పలు సందర్భాల్లో తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్ గా కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఏ ఒక్కటని చెప్పగలం మీ నటన, డాన్స్, మీ డైలాగ్స్, మీరు పాడిన పాటలు అన్ని మీకు నన్నొక వీరాభిమానిగా మార్చేశాయి. కొంత కాలం పాటు మీ సినిమాలు కొన్ని ప్లాప్ అయినా కూడా ఎక్కడ ఎప్పుడూ కూడా మీరు నిరాశ చెందకుండా హుందాతనం ప్రదర్శించిన తీరు మీ అభిమానిగా నన్ను మరింత ఆకట్టుకుంది. అలా వరుసగా ఆరు సంవత్సరాల ఎదురు చూపుల‌ తర్వాత టెంపర్ సినిమాతో మళ్లీ మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. 

 

ఒక మీటింగులో కూడా మీరు చెప్పారు టెంపర్ సినిమా నేను చాలా కసితో చేశాను అని, ఆ సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఆ కసి, దయ క్యారెక్టర్ లో మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరు అత్యద్భుతం అని చెప్పాలి. టెంపర్ తో మొదలైన విజయ దుందుభి ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో  మార్మోగుతోంది. మీ కుటుంబంలో జరిగిన రెండు విషాదాలు తరువాత మీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి వచ్చిన అభిమానులకు మీరు ఇచ్చిన సందేశం విని కన్నీళ్లు కార్చని కన్నులు లేవనేది వాస్తవం. అందుకే మేము మీకు ఫ్యాన్స్ అనేదానికన్నా మీ భక్తులం అని చెప్పడానికే ఎక్కువ ఇష్టపడతాం. నాలాంటి ఎందరో అభిమానులు ఎన్టీఆర్‌ devotee అని గర్వంగా చెప్పుకుంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మీకు మాత్రమే ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తమ సహా నటుడి గా కాకుండా బంధువుగా గుర్తింపు ఇచ్చారు. ఇది ఏ సినిమా ఇండస్ట్రీలో అయిన అరుదైన గౌరవం. 

 

రాజమౌళి కి ఆత్మ బంధువు అయినా, జగపతిబాబు మిమ్మల్ని నా బుజ్జి తమ్ముడు తారక్ అనే ఆప్యాయత, నాగార్జున నా పెద్ద పెద్ద కొడుకు తారక్ అని అన్నా, మహేష్ బాబు తమ్ముడు తారక్ అనే పిలుపులో, అల్లు అర్జున్ బావ అన్న బంధంలో మీ విలువ ఏంటి అనేది చెప్పకుండానే చెబుతుంది. సినిమా విషయాన్ని పక్కన పెడితే, అన్నా..! మీరు ఇచ్చే మోటివేష‌న‌ల్‌ స్పీచ్ కి అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మీరు మాటలతో ఆకట్టుకుంటారు అంటే తక్కువ అవుతుంది.. కాబట్టి మీరు మీ మాటలతో ఎదుటి వారిని మంత్రముగ్ధులను చేస్తారు అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ devotees అని గర్వపడే మీ అభిమానులు టీమ్ తారక్ ట్రస్ట్ గా ఏర్పడి విపత్కర పరిస్థితుల్లో తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. వెండితెర మీదనే కాక బుల్లితెర పై హోస్ట్ గా చేసి ఎన్టీఆర్‌ స్టామినా ఏంటో చూపించారు. ఇలా ప్రతీ ఒక్కటీ నన్ను మీకొక వీరాభిమానిని చేశాయి. మీ పుట్టినరోజు సందర్భంగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రకంగా తెలియజేస్తున్నాను. ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో బిక్కిన శ్రీ సౌమ్య పేరుతో వైర‌ల్ అవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: