మెగస్టార్ చిరంజీవి ఇపుడు టాలీవుడ్ కి పెద్ద దిక్కు అయ్యారు. ఆయన ఈ మధ్య యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. కరోనా వేళ లాక్ డౌన్ విధించడం వల్ల ఇబ్బంది పడుతున్న సినీ కార్మికుల కోసం నిధులు సేకరించి వారికి అన్ని విధాలుగా ఆదుకున్న ఘ‌నతను మెగాస్టార్ దక్కించుకున్నారు.

 

ఇపుడు మరో  మెగా ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అదేంటి అంటే రెండు నెలలుగా షూటింగులు లేవు. సినిమా ఊసు లేదు. అసలు టాలీవుడ్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ  లాంటి వారు ఇప్పటికీ లాక్ డౌన్ ఇంకా కొనసాగిస్తే తాము రోడ్డు మీద పడాల్సిందేనని చెప్పేస్తున్నారు.

 

అది ఒక్క బ్రహ్మాజీ బాధ కాదు, మొత్తం సినిమా ఇండస్ట్రీ  బాధగానే ఉంది. సినిమాల షూటింగులకు అనుమతి లేదు. దాంతో చేతులు గిల్లుకుంటూ కూర్చుంటున్నారు. మరో వైపు సినిమా ధియేటర్లు మూడు నెలల పాటు తెరవడానికి వీలు లేదని మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. 

 

చూస్తూంటే టాలీవుడ్లో పెద్ద సంక్షోభమే వచ్చేలా ఉంది. దాంతో మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుని తన ఇంట్లో రేపు మెగా మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మీటింగ్ కి నిర్మాతలు, డైరెక్టర్లు, ఇతర విభాగాల వారు, హీరోలు కూడా హాజరవుతారని అంటున్నారు.

 

ఈ మీటింగులో లాక్ డౌన్, టాలీవుడ్ మీద పడిన ప్రభావం, భవిష్యత్తు కార్యాచరణ వంటివి చర్చిస్తారని అంటున్నారు. మరి చూడాలి ఈ మీటింగ్ లో ఏ నిర్ణయాలు వస్తాయో. మొత్తం మీద మెగాస్టార్ తొలి అడుగేశారు సినిమా పరిశ్రమకు సంబంధించి కీలక పరిణామాలే జరుగుతాయేమో చూడాలి. ఏది ఏమైనా కరోనా నేపధ్యంలో ఎన్నడూ చూడని ఇబ్బందులను టాలీవుడ్ చూస్తోంది. దాంతో సరైన పరిష్కారం కనుగొనాలని అంతా అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: