మెగాస్టార్ గా చిరంజీవి కెరీర్ మంచి ఫాంలో ఉన్న రోజులవి. అప్పటికే ఎన్నో భారి విజయాలను తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్నాడు చిరంజీవి. ఆ క్రమంలో రాఘవేంద్ర రావు, చిరంజీవి కాంబినేషన్  లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా తో వీరి కాంభి నేషన్  బాగా ఫేమస్ అయ్యింది. అయితే ఈ సినిమా అప్పట్లో 6 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక అప్పటి నుండి చిరంజీవి సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఆ తర్వాత వచ్చిన కొండవీటి దొంగ, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. 

 

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సాధించిన విజయం తర్వాత రాఘవేంద్రరావు, చిరంజీవి కాంబినేషన్  పై  భారీ అంచనాలు నెలకున్నాయి. ఆ అంచనాలను తిరగరాస్తూ వీరి కాంబినేషన్  లో వచ్చిన సినిమా ఘరానా మొగుడు. టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా ఉన్న చిరంజీవికి తన కెరీర్ లో ఘరానా మొగుడు సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. 1992లో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే 100 మిలియన్ వసూళ్ళను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అనగా ఏకంగా 10 కోట్ల వసూళ్ళు సాధించింది. 

 

అప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో టాప్ లిస్టు లో ఉన్న కథానాయకుడు చిరంజీవి. ఈ సినిమా భారీ విజయం సాధించే నాటికే చిరంజీవి రెమ్యునరేషన్ కోటి కి చేరింది. అంతలా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక పోతే ఘరానా మొగుడు సినిమాకన్నడ సినిమాకు రీమేక్ గా తీసారు. ఈ సినిమాలో డైలాగ్స్ పరచూరి బ్రదర్స్ అందించగా నగ్మా, వాణి విశ్వనాథ్ గ్లామర్ బాగా కలిసి వచ్చింది. ఈ సినిమా సంగీత పరంగా కూడా ప్రేక్షకులకు చేరువైంది. ఎం ఎం కీరవాణి అందించిన స్వరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఒక ఊపు ఊపాయనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: