టాలీవుడ్ లో చిరంజీవి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అంతలా ఆయన ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఆయన అసలు పేరు శివ సంకర వరప్రసాద్. కాని ఆ పేరు సినీ రంగంలోకి ప్రవేశించాక చిరంజీవిగా స్థిరపడింది. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు, విలన్ పాత్రలు చేసిన చిరంజీవి ఖైదీ సినిమా తో హీరోగా నిలదొక్కుకున్నాడు. చిరంజీవి రీల్ లైఫ్ లోనే కాక రియల్ లైఫ్ లో పలు సేవా కార్యక్రమాలతో హీరో అనిపించుకుంటున్నారు. 

 

 

చిరంజీవి స్టార్  ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత నుండి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 1998 లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించి పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు. ఈ ట్రస్ట్ ద్వారా చిరంజీవి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ద్వార సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇవి రాష్ట్రంలో అత్యధిక రక్తదానం, నేత్రదానం సాగిస్తున్న సంస్థలుగా గుర్తింపు పొందాయి. ఇప్పటి వరకు ఈ సంస్థలు ద్వారా చాలా మందికి లబ్ది చేకూరింది. ఈ సంస్థల సేవకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ సేవా సంస్థలుగా పురస్కారాలను అందుకున్నాయి. 

 

అయితే చిరంజీవి అక్కడితో ఆగకుండా ఎప్పటి కప్పుడు సేవే లక్ష్యంగా ప్రజలతో మమేకం అవుతూ ఉన్నారు. తాజాగా ఇప్పుడు కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీని తో చిత్ర పరిశ్రమపై ఆధారపడి ఉన్న అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇండస్ట్రీ ని నమ్ముకున్న సినీ కార్మికుల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైస్తిస్ చారిటి పేరుతో ఒక సంస్థను స్థాపించారు. దీనికి సినీ ప్రముఖుల నుండి విశేష స్పందన లభించింది. ఈ సంస్థ ద్వారా సేకరించిన భారీ విరాళాలను సినీ కార్మికులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: