టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని సినిమాల కోసం అభిమానులు ఏ విధంగా ఎదురు చూస్తారు అనేది అందరికి తెలుసు. అతని సినిమా వస్తుంది అంటే చాలు చాలా మందికి ఒక పండగ అనే విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం ఆయన... వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ సినిమా తో పాటుగా పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

 

సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మొదలు పెట్టే సూచనలు ఉన్నాయి. ఇక ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఒక వెబ్ సీరీస్ లో నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వెబ్ సీరీస్ లో పవన్ కళ్యాణ్ ఒక డాక్టర్ గా నటిస్తారు అని మానసిక వైద్యుడిగా ఆయన నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఎంత వరకు నిజమో గాని ఒక బాలీవుడ్ చిన్న దర్శకుడు దీన్ని ప్లాన్ చేయగా బోనీ కపూర్ ద్వారా అడగగా పవన్ ఓకే చెప్పారని సమాచారం 

 

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి ఆ తర్వాత డిసెంబర్ నాటికి విడుదల చేసే సూచనలు ఉన్నాయని సమాచారం. దీని కోసం పవన్ కళ్యాణ్ పూణే లో నెల రోజుల పాటు ఉండే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. నిజం ఎంతో తెలియదు గాని దీనికి దిల్ రాజు నిర్మాత అని అంటున్నారు. మరి ఈ వెబ్ సీరీస్ వస్తుందో లేదో చూడాలి. పవన్ వకీల్ సాబ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: