టాలీవుడ్ లో స్టార్ హీరో కొడుకులు అయినా సరే మంచు మనోజ్ మంచు విష్ణు మాత్రం ఒక్క మంచి సినిమాను ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేయలేకపోయారు అని అంటూ ఉంటారు అభిమానులు. వారి నుంచి ఒక్క సూపర్ హిట్ ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే అది మాత్రం సాధ్యం కావడం లేదు. ఇక వాళ్లకు ఉన్న అన్ని మార్గాలు కూడా ఇప్పుడు కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. దర్శక నిర్మాతలు వాళ్ళను నమ్మి సినిమాలను చేసే పరిస్థితి లేదు అని పలువురు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక వాళ్ళు ఇప్పుడు ఒక మంచి విజయం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది అనేది వాస్తవం. 

 

ఈ నేపధ్యంలో మంచు మనోజ్ ఒక భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు సినిమాలో ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరి ఏ సినిమాలో నటిస్తాడు అనేది తెలియదు గాని అతను ఒక విలన్ పాత్రలో నటించే అవకాశం ఉందనే ప్రచారం మాత్రం సోషల్ మీడియా లో విస్తృతంగా జరుగుతుంది. మహేష్ బాబు స్వయంగా మంచు మనోజ్ కి ఫోన్ చేసి అడిగాడు అని మంచు మనోజ్ కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని అంటున్నారు. నిజం ఎంత అనేది త్వరలోనే స్పష్టత వస్తుంది. 

 

ఇది ప్రస్తుతం సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్న సినిమా అని అంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు మహేష్ బాబు కొందరు హీరోలను తన సినిమాల్లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే మంచు మనోజ్ ని తన సినిమాలో తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. మహేష్ ప్రస్తుతం రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: