టాలీవుడ్ లో జగపతి బాబు కి ఫ్యామిలీ హీరోగా గతంలో విపరీతమైన క్రేజ్ ఉండేదన్న విషయం అందరికి తెలిసిందే. శోభన్ బాబు తర్వాత మళ్ళీ అదే రేంజ్ నేం అండ్ ఫేం ని సాధించుకున్నాడు. ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ కొడుకుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జగపతి బాబు మొదటి సినిమాతో అట్టర్ ఫ్లాప్ ని చూశాడు. దాంతో చాలామంది హీరోగా పనికిరాడని కామెంట్స్ చేశారు. అయితే ఆ తర్వాత అదే జగపతి బాబు స్టార్ అని పొగడ్తలతో ముంచేశారు. శుభాకాంక్షలు, శుభ లగ్నం, హనుమాన్ జంక్షన్ లాంటి ఎన్నో సూపర్ హిట్స్ అని అందుకొని తనకంటూ టాలీవుడ్ లో ఒక సపరేట్ మార్కెట్ ని సంపాదించుకున్నారు.

 

అయితే హీరోగా ఫ్లాప్స్ రావడంతో కొన్నేళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మళ్ళీ బోయపాటి శ్రీను లెజెండ్ సినిమాతో కొత్త ఇమేజ్ వచ్చేలా చేశాడు. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన జగపతి సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నాడు. చెప్పాలంటే ప్రకాశ్ రాజ్ ని మించి అద్భుతమైన క్యారెక్టర్స్ ని పోషిస్తున్నారు. స్టైలిష్ విలన్ గా, ఫాదర్ గా, పాజిటివ్ క్యారెక్టర్స్ తో జగపతి ఫుల్ ఫాం లోకి వచ్చారు. ఇప్పుడున్న సీనియర్ హీరోల దగ్గర్నుంచి యంగ్ హీరోల వరకు అందరికి బెస్ట్ విలన్ అన్న బెస్ట్ ఫాదర్ అన్న ఫస్ట్ ఛాయిస్ జగపతి బాబు అని ఫిక్సవుతున్నారు.

 

ఇక ఇదే నేపథ్యంలో జగపతిబాబు సినిమాలనే కాక వెబ్ సిరీస్ లలోను నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న జగపతి బాబు తాజాగా మరో వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించారు. ఈ వెబ్ సిరీస్ లో కండోమ్ ఫ్యాక్టరీ కి ఓనర్ గా నటిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫాం కి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలోనే జగపతిబాబు ఇలా వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకుంటున్నారు. ఇక ఇప్పటికే నాన్నకి ప్రేమతో, ఇజం, శ్రీమంతుడు, అరవింద సమేత, సైరా లాంటి సూపర్ హిట్ సినిమాలతో హీరోలకి ధీటుగా నటిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: