టాలీవుడ్ లో రానా పెళ్లి గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. అతని పెళ్లి ప్రేమ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అతని పెళ్లి గురించి సోషల్ మీడియా లో ఏదోక వార్త మనం చదువుతూనే ఉన్నాం. ఇక ఇప్పుడు అతని పెళ్లి కుదిరింది. ఇక పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక నేటి సాయంత్రం నిశ్చితార్ధం అయిపోతుంది అనే ప్రచారం ఎక్కువగా జరిగింది. మిహీకా బ‌జాజ్ అనే యువ‌తిని రానా ప్రేమించ‌డం.. రానా ఆమెకు ప్ర‌పోజ్ చేయ‌గా ఆమె కూడా రానాకు ఓకే చెప్పేసింద‌ని రానా సోష‌ల్ మీడియా సాక్షిగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త అతని పెళ్లి గురించి బయటకు వస్తుంది. పెళ్లిని అతను ఇక్కడ చేసుకోవడం లేదని అసలు ఇండియా లో పెళ్లి కాదని వేరే దేశంలో చేసుకుంటున్నాడు అని అంటున్నారు. తన చిన్న నాటి ఫ్రెండ్ ఫ్రాన్స్ లో ఉన్నారు అని... వచ్చే ఏడాది జనవరి తర్వాత ఈ వివాహం ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. సురేష్ బాబు ఇప్పుడు దీనిపై ఓకే చెప్పారని అంటున్నారు. 

 

కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాతే వాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని... అప్పటి వరకు పెళ్లి అనే మాటే లేదని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. వాళ్ళ అంచనా ప్రకారం వచ్చే ఏడాది కి క‌రోనా కచ్చితంగా త‌గ్గుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. ఆ త‌ర్వాత మంచి ముహూర్తం చూసుకుని యూరప్ లో పెళ్లి చేసుకునేలా ప్లానింగ్ ఉంటుంద‌ని అంటున్నారు. ఇక అతి తక్కువ మంది మాత్రమే ఈ పెళ్ళికి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీనిపై త్వరలో స్పష్టత వస్తుంది. ఇక రానా పెళ్లి జ‌రుగుతుండ‌డంతో ఇప్పుడు టాలీవుడ్‌లో మిగిలిన మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ అయిన ప్ర‌భాస్ పెళ్లి వార్త కోసం వెయిట్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: