అగ్ర హీరోల సినిమాలు అనగానే ప్రేక్షకులకు ముందు నుంచి కూడా ఒక అంచనా అనేది ఉంటుంది. సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే ఆ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా ఏ స్థాయిలో ఉంటుంది అనేది పక్కన పెడితే అభిమానులకు మాత్రం సినిమా మీద ఒక స్థాయిలో అంచనాలు అయితే ఉంటూ ఉంటాయి. కథ ఏ విధంగా ఉంటుంది సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది పక్కన పెడితే ప్రేక్షకులు గాని అభిమానులు గాని సినిమాను మాత్రం ప్రాణం పెట్టి చూస్తారు అనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. 

 

అందులో బాగా ఫ్లాప్ అయిన సినిమాలను చూసి బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభాస్ హీరోగా వచ్చిన బిల్లా సినిమా హడావుడి చూసి ఆ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది అని భావించారు అందరూ కూడా. ఆ సినిమా ద్వారా ప్రభాస్ కచ్చితంగా హాలీవుడ్ లో కి అడుగు పెట్టడం ఖాయమనే ప్రచారం కూడా అప్పట్లో ఒక రేంజ్ లో జరిగింది. ఆ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు చూసి మెహర్ రమేష్ తో అనవసరంగా ప్రభాస్ సినిమా చేసాడని చాలా మంది అప్పట్లో మీడియా ముందు అన్నారు కూడా. ఆ సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అప్పట్లో. 

 

అయితే సినిమా అంచనాలను అందుకోలేక ప్రభాస్ ని ఎలాగో చూపించాలి అనుకుని మరేలాగో చూపించి దర్శకుడు బాగా ఇబ్బంది పడ్డాడు అని అన్నారు అప్పుడు. ఆ విధంగా సినిమా చాలా దారుణంగా ఉంది అనే కామెంట్స్ మనం చూసాం కూడా. ఇక ఆ సినిమా తర్వాత ప్రభాస్ చాల ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది ఆయన అభిమానులు పదే పదే చెప్తూ వచ్చే మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: