మన తెలుగులో కొన్ని కొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు పెట్టుకునే అంచనాల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా అనగానే ఏ స్థాయిలో ఉంటుందో అని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. కాని సినిమాలు మాత్రం కొన్ని ఆయన అభిమానులను బాగా ఇబ్బంది పెట్టాయి. ఒక దర్శకుడు వేరే హీరో తో అందుకోగానే ఆ దర్శకుడికి పిలిచి అవకాశం ఇస్తూ ఉంటాడు తారక్ అని చాలా మంది చాలా సందర్భాల్లో కామెంట్ చేసారు. అలా చేసే ఆయన బాగా ఇబ్బంది కూడా పడ్డాడు అని అంటారు. 

 

రామయ్య వస్తావయ్య సినిమాలో ఇలాగే జరిగింది అని అంటారు. హరీష్ శంకర్ ఆ సినిమాకు ముందు పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమాను చేసారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. వెంటనే ఎన్టీఆర్ హరీష్ ని పిలిచి సినిమా చేద్దాం అని చెప్పగానే హరీష్ కూడా సినిమాను ఓకే చేయడం కథ రెడీ చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళడం దాదాపుగా జరిగిపోయాయి. కాని సినిమాను సరిగా తీసే టైం తారక్ ఇవ్వలేదు అని అంటారు. ఆ సినిమా కథ విషయంలో కూడా తారక్ వేలు పెట్టాడు అనే ఆరోపణలు కూడా అప్పట్లో చాలా వరకు వినిపించాయి.

 

అప్పటికే మూడు ఫ్లాపులతో ఎన్టీఆర్ బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఆ తరుణంలో ఈ సినిమా ను ఓకే చేసి ఎలా అయినా సరే హిట్ కొట్టాలి అని భావించాడు. కాని అది సాధ్యం కాక తర్వాత బాధ పడ్డాడు. తర్వాత హరీష్ శంకర్ అవకాశం  కోసం ఎదురు చూసినా సరే తారక్ మాత్రం ఇవ్వలేదు అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో తారక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: