మన తెలుగులో కొందరు హీరోలు సినిమాలు ఎప్పుడు చేసినా సరే చూస్తూ ఉంటారు. సినిమాకు ఉండే క్రేజ్ గాని సినిమాకు ఉండే ఆదరణ గాని ఎక్కడా కూడా తగ్గే అవకాశాలు అనేవి దాదాపుగా ఉండవు అనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు సినిమా ఎప్పుడు వచ్చినా సరే చూస్తారు ప్రేక్షకులు. మహేష్ బాబు ఆయన సినిమాల మీద పెట్టుకునే అంచనాలు సహా ఆయన సినిమాల మీద ఉండే ఆశ అంతా ఇంతా కాదు. మహేష్ బాబు సాధారణంగా ప్రయోగాలు చేయడానికి ఏ మాత్రం కూడా ఇష్టపడే అవకాశం అనేది దాదాపుగా ఉండదు అనే చెప్పుకోవచ్చు. 

 

అయితే మహేష్ బాబు కాస్త ప్రయోగం చేద్దాం అని భావించి సినిమాలను తీసుకొస్తే ఆ సినిమాలు మాత్రం ఘోరంగా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా బ్రహ్మోత్సవం. ఈ సినిమా టీవీ లో వచ్చినా సరే చూసే పరిస్థితి దాదాపుగా ఉండదు అని అంటారు. ఈ సినిమాలో మహేష్ బాబు నటన బాగున్నా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం మాత్రం ఏ విధంగా కూడా ఆకట్టుకోలేదు అనే ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. మహేష్ బాబు స్థాయికి తగిన విధంగా ఈ సినిమాను తీయలేదు అని కొందరు ఆరోపణలు కూడా చేసారు. 

 

మహేష్ బాబు ని చూపించాల్సిన విధంగా దర్శకుడు చూపించి ఉంటే కచ్చితంగా సినిమా అనేది చాలా వరకు అంచనాలకు మించి విజయం సాధించేది అని చాలా మంది అన్నారు కూడా. ఇక ఇప్పుడు మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఇక మహేష్ బాబు ఇప్పుడు కొన్ని సినిమాలకు నిర్మాతగా చేసే ప్లాన్ ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: