ఎన్టీఆర్ బయోపిక్... రెండు భాగాలుగా వచ్చిన సినిమా ఇది. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా నందమూరి బాలకృష్ణ తీసుకొచ్చిన ఈ సినిమా గురించి జరిగిన చర్చలు ఈ సినిమా గురించి ప్రేక్షకులు పెట్టుకున్న ఆశలు నందమూరి అభిమానులు పెట్టుకున్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు అనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రధానంగా బాలకృష్ణ నటనకు మంచి మార్కులు పడినా సినిమాను సరిగా తీసి ఉంటే మరో రేంజ్ లో ఉండేది అని అంటారు. ఎన్టీఆర్ బయోపిక్ అనగానే చాలా మంది ఎదురు చూసారు కూడా. కథానాయకుడు, మహా నాయకుడు అనే రెండు భాగాలుగా ఈ సినిమా వచ్చింది. 

 

కాని ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలతో మాత్రం సినిమా రాలేదు అనేది వాస్తవం. సినిమాను సరిగా తీసి ఉంటే ఇంకో స్థాయిలో ఉండేది అని చాలా మంది అప్పట్లో కామెంట్ చేసారు. ఇక బాలకృష్ణ కూడా అనవసరంగా అడుగు వేసాను అని కూడా అనుకున్నారని అంటారు. ఆయన ఈ సినిమా మీద చాలా నష్టపోయారు అని దర్శకుడు క్రిష్ కూడా ముందు ఈ సినిమా గురించి చాలా ఆశలు పెట్టుకుని చేసాడు అని కాని ఆయనకు ఈ సినిమా చాలా ఇబ్బంది గా మారింది అని అంటారు. ఈ సినిమా నుంచి టాలీవుడ్ కూడా చాలా నేర్చుకుంది అనేది చాలా మంది నుంచి వినిపించే మాట. 

 

సినిమా తర్వాత మన తెలుగులో బయోపిక్ అనేది చెయ్యాలి అంటే చాలు చాలా మంది భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అని అంటారు. ఆ విధంగా ఈ సినిమా ఫ్లాప్ అయింది. అసలు ఎన్టీఆర్ జీవితాన్ని సరిగా చూపించలేదు అని చాలా మంది అన్నారు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: