ఇండియన్ స్క్రీన మీద తిరుగులేని ప్రేమ కథ అంటే ఎవరికైన గుర్తొచ్చే సినిమా దేవ దాసు. విజయవంతమైన ప్రేమ కథ కాకపోయినా గొప్ప ప్రేమికులు అంటే దేవదాసు పార్వతిల పేర్లనే గుర్తు చేసుకుంటారు. అందుకే ఆ కథను పదే పదే తెర మీదకెక్కించే ప్రయత్నం చేశారు. తెలుగులోనూ ఈ సినిమా రెండు సార్లు రూపొందింది. ఒకసారి ఘనవిజయం సాదించగా మరోసారి మాత్రం నిరాశపరిచింది. తెలుగు ప్రేక్షకులకు దేవదాసు అంటే అక్కినేని నాగేశ్వరరావే. అంతలా ఆ పాత్రలో ముద్ర వేశాడు అక్కినేని.

 

ముఖ్యంగా ప్రియురాలికి దూరమై మధ్యానికి బానిసైన అమర ప్రేమికుడిగా ఏఎన్నార్ నటన అనితర సాధ్యం. అందుకే బాలీవుడ్‌ నటులు సైతం అక్కినేనిలా దేవదాసు పాత్రకు మేం న్యాయం చేయలేమని బహిరంగంగానే ప్రకటించారు. అలాంటి టాలీవుడ్‌ డాషింగ్‌ హీరో సూపర్‌ స్టార్‌ కృష్ణ మాత్రం అక్కినేని మరిపించేందుకు ప్రయత్నించాడు. 1974లో అప్పటి ఉన్న ఆధునిక హంగులన్నింటినీ జోడించి అద్భుతంగా దేవదాసు కథను మరోసారి వెండితెరకెక్కించాడు. విజయ నిర్మల దర్శకత్వంలో ఎస్‌ రామానంద్, ఎస్ రవికుమార్‌లు ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా కృష్ణకు అనుకున్న స్థాయి విజయాన్ని అంధించలేకపోయింది.

 

ముఖ్యంగా ఏఎన్నార్ దేవదాసు అప్పటికీ ప్రజల మనసుల్లో క్లాసిక్‌గా నిలిచిపోవటంతో ప్రతీ విషయంలో ఈ సినిమాను ఆ సినిమాతో పోల్చి చూశారు. దీంతో రిలీజ్ ముందే నుంచి కృష్ణ దేవదాసు మీద కాస్త నెగెటివ్ ఇంప్రెషన్‌ ఉంది. తెర మీదకు వచ్చిన తరువాత కూడా ఆ తరం ప్రేక్షకులు దేవదాసును పెద్దగా ఆదరించలేదు. అందుకు మరో కారణం కూడా ఉంది. ఇండస్ట్రీ అప్పుడే మాస్ కమర్షియల్ సినిమాల వైపు మళ్లుతోంది. కృష్ణ కూడా కమర్షియల్ స్టార్‌గా సూపర్‌ ఫాంలో ఉన్నాడు. ఆ సమయంలో ఓ పాతటిక్‌ లవ్ స్టోరి చేయటంతో అభిమానులకు రుచించలేదు. దీంతో దేవదాసు డిజాస్టర్ల లిస్ట్‌లో చేరిపోయింది.  మ్యూజికల్‌గా మాత్రం ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: