కరోనా మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దాదాపు అన్ని రంగాలూ ఈ వైరస్ ధాటికి దెబ్బతిన్నాయి. వాటిలో సంగీత రంగం కూడా ఒకటి. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో చాలామంది గీత రచయితలు, కంపోజర్లు నానా ఇబ్బందులూ పడుతున్నారు. ఇటువంటి వారిని ఆదుకోవడం కోసం ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్ సొసైటీ (ఐపీఆర్‌ఎస్) ఏప్రిల్ నెలలో ఆర్థిక సాయం ప్రకటించింది. ఇప్పుడు మళ్లీ రెండో విడతగా సంగీత కళాకారులకు ఆర్థికసాయం అందించనున్నట్లు ప్రకటించింది. దీని వల్ల దాదాపు 3,500మంది సంగీత కళాకారులు లబ్దిపొందుతారని సమాచారం. ఈ సందర్భంగా ఐపీఆర్‌ఎస్ చైర్మన్ జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. ‘సంగీత రంగాన్ని మెరుగు పరచడానికి, దాని అభివృద్ధిలో భాగస్వాములం అవడానికి ఐపీఆర్‌ఎస్ స్థాపన జరిగింది. ఈ విపత్కర పరిణామాల్లో సంగీత కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. ఏప్రిల్‌ లో మేం అందించిన ఆర్థికసాయం చాలామందికి ఊరటనిచ్చింది. ఈసారి విడుదల చేస్తున్న సొమ్ము కూడా కళాకారుల అవసరాలను తీరుస్తుందని భావిస్తున్నాం’ అని చెప్పారు. 

 

ఆదిత్య మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఆదిత్య గుప్త మాట్లాడుతూ..''ప్రతిష్టాత్మక ఐపిఆర్ఎస్ బోర్డు మెంబెర్ గా తెలుగు రాష్ట్రలకే కాదు యావత్ సౌత్ ఇండియాకి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందం గా ఉంది. ఈ సొసైటీ లో ఉన్న మ్యూజిక్ కంపోజర్స్, లిరిక్ రైటర్స్ అందరితో ఆదిత్య మ్యూజిక్ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. వారందరికి ఐపిఆర్ఎస్ తరుపున రావాల్సిన కరోనా రిలీఫ్ ఫండ్ నూటికి నూరు శాతం వచ్చేలా కృషి చేశామని అన్నారు ఆదిత్య గుప్త. భవిష్యత్ లో సంగీత కళాకారులుకు అండగా ఉండే విధంగా ఆదిత్య మ్యూజిక్ తరుపున అన్ని రకాలుగా ఐపిఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తాము'' అని తెలిపారు.

 

ప్రముఖ రచయిత చంద్రబోస్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ…''తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఆదిత్య మ్యూజిక్ 30 ఏళ్ళుకి పైగా ఆదిత్య మ్యూజిక్ తెలుగు మ్యూజిక్ లవర్స్ ని విశేషంగా అలరిస్తుంది. ఈ లేబిల్ ద్వారా నా పాటలు ఎన్నో బయటుకు వచ్చాయి. ఆదిత్య వారు మా పాటలని విడుదల చేయడమే కాదు మాకు ఎలాంటి విపత్తులు వచ్చిన మాకు అండగా నిలబడిన సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలోనే ప్రఖ్యాత ఐ పిఆర్ఎస్ బోర్డు మెంబర్ గా అటు తెలుగుకే ఇటు యావత్ సౌత్ ఇండియా కి ప్రాతినిధ్యం వహించి కరోనా రిలీఫ్ ఫండ్ ఎందరో తెలుగు సంగీత కళాకారులకి అందేలా కృషి చేయడం చాలా అభినందనీయం. ఆదిత్య మ్యూజిక్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు'' అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: