రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ నుండి ఎన్టీఆర్ పుట్టినరోజున ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ని మన ఊహకందని రీతిలో ప్రెజెంట్ చేసిన రాజమౌళి, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ని అంతకంటే భిన్నంగా చూపిస్తాడని ఆశపడ్డారు. కానీ ఆ ఆశలన్నీ అడియాశలైపోయాయి.

 

దాంతో అభిమానులు కొంచెం డీలా పడ్డారు. ఆర్.ఆర్.ఆర్ నుండీ ఏ అప్డేట్ రానందువల్ల వారిలో కొంచెం ఉత్సాహం తగ్గిన మాట వాస్తవమే అయినప్పటికీ, అది ఏ కోశాన కనిపించకుండా నిన్న సోషల్ మీడియాలో వారు చేసిన సందడి మామూలుగా లేదు. మంగళవారం సాయంత్రం నుండి స్టార్ట్ చేసి బుధవారం సాయంత్రం వరకు ఎన్టీఆర్ బర్త్ డే ని ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. మొత్తం ౨౪గంటల వ్యవధిలో ౨౨.౫ మిలియన్ల ట్వీట్లు వేశారు.

 

ఎన్టీఆర్ బర్త్ డే కి ౧౧ రోజుల ముందు నుండే ప్లాన్ వేసుకున్న అభిమానులు అనుకున్నది చేసి చూపించారు. టాలీవుడ్ లో మరే హీరోకి రానన్ని ట్వీట్లు ఎన్టీఆర్ కి పడ్డాయి. ఈ లెక్కన ఎన్టీఆర్ మానియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ అభిమానులు గబ్బర్ సింగ్ సినిమా రిలీజై ౮సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్ ని షేక్ చేసి ౧౩.౫ మిలియన్ల ట్వీట్లు వేసారు.

 

అప్పుడు అదే అత్యధికం అనుకుంటే కొద్ది రోజుల్లోనే దాన్ని మించేసి వెళ్ళిపోయారు. గతంలో ఎన్టీఆర్ అభిమానులు ఈ రేంజ్ లో సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండేవారు కాదు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ రేంజ్ మరింతగా పెరగనుంది. పాన్ ఇండియా రేంజ్ లో అతనికి ఫాలోయింగ్ ఏర్పడనుంది. అందువల్లే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ రికార్డుని ఏ హీరో అభిమానులు బద్దలు కొడతారో..!

మరింత సమాచారం తెలుసుకోండి: