కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో నిర్మాతలు ఓటీటీ వైపు చూస్తున్నారు. అక్కడ ఒక్కో సినిమాకి మంచి ఆఫర్లు వస్తుండడంతో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునేలా లేవు. అన్నింటికీ పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం వేల మంది ఒకే చోట గుముగూడే థియేటర్స్, మాల్స్ ,ఫంక్షన్ హాల్స్ కి అనుమతులు ఇవ్వలేదు.ఇప్పట్లో ఇచ్చేలా కూడా కనిపించడం లేదు.

 

 

ఈ నేపథ్యంలో నిర్మాతలందరూ ఆన్ లైన్ లో సినిమా రిలీజ్ చేసేయాలని చూస్తున్నారు. రానా హీరోగా నటించిన అరణ్య సినిమాకి ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చిందట. ప్రభు సోలోమన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని పూర్తిగా అడవుల్లోనే చిత్రీకరించారు. చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు గ్రాఫిక్స్ కూడా ఎక్కువే. ఈ సినిమా తీయడానికి ప్రభు సోలోమన్ చాలా టైమ్ తీసుకున్నాడు.

 

సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం జాదవ్ పాయెంగ్ అనే లైఫ్ ఆక్టివిస్ట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు.ఈ చిత్రం ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో చెబుతుంది. మానవాళి భవితవ్యం మొత్తం ప్రకృతి మీదే ఆధారపడి ఉందన్న విషయాన్ని గుర్తి చేస్తుందట. ప్రకృతి లేకపోతే మన భవిష్యత్తే లేదన్న విషయాన్ని చెబుతుందట. ఈ సినిమాకి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ నుండి భారీ ఆఫర్ వచ్చిందట.

 

దీంతో సురేష్ బాబు ఆలోచనలో పడ్డారట. ఆ ఆఫర్ ని దర్శకుడు ప్రభుకి పంపించారట. ఒకవేళ దర్శకుడు ఓకే అనుకుంటే ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లో దర్శనమివ్వనుంది. మరి ప్రభు సోలోమన్ ఏమంటాడో చూడాలి. అయితే విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న చిత్రాలని నెట్ ఫ్లిక్స్ లో కంటే థియేటర్లో చూస్తేనే మంచి ఫీలింగ్ కలుగుతుందన్న సంగతి తెలిసిందే..

 

మరింత సమాచారం తెలుసుకోండి: