మన తెలుగులో భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఖలేజా. మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో తీసుకొచ్చారు. ఈ సినిమా ద్వారా మహేష్ బాబు భారీ హిట్ కొట్టాలి అని ప్లాన్ వేసి ఒక్కసారిగా షాక్ అయ్యారని టాలీవుడ్ జనాలు అంటూ ఉంటారు. ఈ సినిమా ద్వారా మహేష్ బాబు తన ప్రేక్షకులకు ఏదో ఇవ్వాలి అని భావించారు అని కాని ఆయన ఏదీ ఇవ్వలేదు అని కామెంట్స్ చేసారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క నటించగా ఈ సినిమా టీవీ లో వస్తే చాలా మంది చూసారు గాని సినిమాను హాల్ లో చూడటానికి ఎవరూ కూడా ఆసక్తి చూపించలేదు. 

 

సినిమా విషయంలో మహేష్  బాబు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేసినా సరే సినిమా మాత్రం విజయం సాధించలేదు అనేది వాస్తవం. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర కామెడి గా ఉందని కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెట్టాయని చాలా మంది అన్నారు అప్పట్లో. ఇక ఈ సినిమాలో నటించిన అనుష్క కూడా తర్వాత తర్వాత మహేష్ బాబు తో సినిమా ఆఫర్ వచ్చినా సరే చేసేది లేదు అని చెప్పి తప్పించుకుంది అని అంటూ ఉంటారు సిని పరిశీలకులు. ఈ సినిమా ద్వారా ఆమె బాలీవుడ్ లోకి కూడా వెళ్ళాలి అని చూసింది. 

 

సినిమా హిట్ అయితే తాను ఇతర భాషల మీద ఫోకస్ పెట్టాలి అని చూసినా సరే ఆమె కు అది సాధ్యం కాలేదు అని చెప్తూ ఉంటారు. ఇక ఆమె కెరీర్ లో అతిపెద్ద ఫ్లాప్స్ లో ఈ సినిమాను కచ్చితంగా చెప్తూ ఉంటారు. కాగా మహేష్ బాబు ఇప్పుడు రెండు సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: