మహేష్ బాబు తన కెరీర్ తొలినాళ్లలో 2 సినిమాల్లో నటించగా అవి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం చెందాయి. ఆ తర్వాత తన మూడవ సినిమా ఐన మురారి చిత్రంలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా... ఆ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ హిట్ అయ్యింది. 2003 వ సంవత్సరంలో విడుదలైన మురారి సినిమాలో మహేష్ బాబు, భూమిక చావ్లా, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా... ఆ సినిమా తెలుగు ఇండస్ట్రీలో అతి పెద్ద హిట్ గా నిలిచి మహేష్ బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 

 

అదే సంవత్సరంలో డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన నిజం సినిమా విడుదలకాగా... అందులో మహేష్ బాబు, తాళ్లూరి మహేశ్వరి, గోపీచంద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా కాకపోయినా మహేష్ బాబు అమాయకపు పాత్ర అందర్నీ ఫిదా చేసేసింది. ఆ సినిమా తర్వాత మహేష్ బాబు నాని అనే ఓ తమిళ రీమేక్ చిత్రంలో చిన్న పిల్లాడు పెద్దది గా మారితే ఎలా ఉంటుందో అనే పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు వెల్లువెత్తాయి. నిజం సినిమాలో మహేష్ బాబు నటనకు అభిమానులైన లక్షల మంది తన నెక్స్ట్ సినిమా ఐన నాని పై ఎన్నో అంచనాలు పెంచుకున్నారు.


మే 14వ తేదీన, 2004లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట కే డిజాస్టర్ అనే టాక్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన అమీషా పటేల్ నటించింది. సైంటిస్ట్ రఘువరన్ 8 ఏళ్ల నాని/ విజయ్/విజ్జు( మహేష్) కుర్రాడిని 28 ఏళ్ల వ్యక్తిగా మార్చిన తర్వాత ఈ సినిమా కథ మొదలవుతుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబుకి బొమ్మల తయారీ సంస్థ యజమాని నాజర్ అతడికి ఉద్యోగం ఇస్తాడు. నాజర్ కూతురు ప్రియా(అమీషా పటేల్) మహేష్ బాబు ని కలిసి ఆ తర్వాత అతని ప్రేమలో పడుతుంది. ప్రియ నాని ని చూసి నిజంగానే అతడు 28 ఏళ్ల వ్యక్తి అనుకొని అతడితో తన లైంగిక కోరికలు తీర్చుకోవాలనుకుంటుంది.

 

మరోవైపు పూర్తిగా మారిపోయిన నాని కారణంగా తన తల్లి ఎంత బాధ పడుతూ ఉంటుంది. తల్లి, ప్రియా నడుమ కొనసాగే ఈ ఫాంటసీ ఫిలిం అతి పెద్ద డిజాస్టర్ గా మహేష్ బాబు కెరీర్ లో పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో అమీషా పటేల్ తన అందాలను ఆరబోసి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది కానీ ఫస్ట్ హాఫ్ సినిమా మాత్రం చాలా బోరింగ్ గా కొనసాగగా సెకండాఫ్ కాస్త పర్వాలేదనిపించింది. గుర్రం ఎక్కడం లాంటి మహేష్ బాబు అమీషా పటేల్ తో చెప్పిన డబల్ మీనింగ్ డైలాగులను సహాయం చేయి అమ్మ గురించి చెప్పిన డైలాగులు బాగున్నాయి. సినిమా మొత్తంలో అసహజత్వం పూర్తిస్థాయిలో కనిపించగా... వీక్ స్క్రిప్టు ఈ సినిమాకి పెద్ద మైనస్ అయిందని చెప్పవచ్చు. టెక్నికల్ విభాగంలో కెమెరా వర్క్ కూడా ఘోరాతి ఘోరంగా ఉండటంతో ఒక్క సీన్ కూడా మంచిగా రాలేదు. మహేష్ బాబు అమీషా పటేల్ శోభనం రాత్రి సన్నివేశం కాస్త అలరించింది కానీ ఈ సినిమా మహేష్ బాబు చేయాల్సింది కాదు అని అప్పట్లో సినీ విమర్శకులు అనేక కథనాలు రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: