మిడ్ రేంజ్ హీరోల్లో నానిని మించిన హీరోలు లేరనే చెప్పాలి. అష్టా చమ్మా సినిమాతో ఇండస్ట్రీకీ పరిచయం అయిన నాని, వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ తన దైన శైలిలో విజయాలతో దూసుకుపోతున్నాడు. మధ్యలో కొన్ని రోజులు నాని పనైపోయిందంటూ వార్తలు రావడంతో తానెంచుకునే స్క్రిప్టుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మజ్ను సినిమా నుండి ఇక తనకి తిరుగులేకుండా పోయింది.

 

 

 

యూత్ కి నచ్చే కథలని తీసుకుని, భిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని పలకరిస్తున్నాడు. నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుందన్న నమ్మకం ప్రేక్షకులలో పడిపోయింది. ప్రస్తుతం నాని చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన "వి" కరోనా కారణంగాఅ రిలీజ్ కాలేకపోయింది. మళ్ళీ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేం.

 

 

అయితే వి తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ చిత్రంలో నటిస్తుండగా, టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ ఒప్పుకున్నాడూ. ఇక నిన్నటికి నిన్న మరో కొత్త దర్శకుడితో సినిమా ఓకే చేశాడు. రంగస్థలం సినిమాకి పనిచేసిన శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడికి నాని అవకాశం ఇచ్చాడు. శ్రీకాంత్ చెప్పిన కథ నచ్చిన నాని వెంటనే ఒప్పేసుకున్నాడట.

 

 

 

అయితే ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ బయటకి వచ్చింది. ఇందులో నాని పాత్ర రంగస్థలంలోని రామ్ చరణ్ పాత్రని పోలి ఉంటుందట. రంగస్థలంలో రామ్ చరణ్ పల్లెటూరి కుర్రాడిగా చాలా అద్భుతమైన నటన కనబరిచాడు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా రామ్ చరణ్ కనబడలేదు. చిట్టిబాబు మాత్రమే కనిపించాడు. మరి అలాంటి పోలికలున్న నాని పాత్ర కూడా చిట్టిబాబు పాత్రలా సక్సెస్ అవుతుందేమో చూడాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: