ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ నుండి ఎన్టీఆర్ లుక్ ని రివీల్ చేస్తారని అనుకుంటే, ఫుటేజీ లేదని అభిమానులకి షాక్ ఇచ్చింది. ఐతే ఈ విషయంలో అభిమానులు కొంత నిరాశ పడినా ఆ తర్వాత ఎన్టీఆర్ బర్త్ డే ని ట్రెండ్ చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్ నుండి వచ్చే ఫస్ట్ లుక్ ని వారందరూ మర్చిపోయారు. ఎన్నొ ఆశలు పెట్టుకున్నాక లుక్ రివీల్ కాకపోవడంవారిని తీవ్ర నిరాశకి గురిచేసిన మాట వాస్తవమే.

 

అయితే కారణలేవైనా ఎన్టీఆర్ లుక్ రిలీజ్ కాలేదు. తాజాగా మరో హాట్ టాపిక్ చర్చకి దారి తీసింది. ఎన్టీఆర్ పుట్టినరోజున రిలీజ్ కాని ఈ లుక్ మళ్లీ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు. ఫస్ట్ లుక్ కోసం మళ్ళీ ఏదైనా పండగ సమయంలో రిలీజ్ చేస్తారా అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ పండగలే ప్రామాణికంగా తీసుకుంటే ఆగస్టు ౧౫వ తేదీ వరకూ చెప్పుకోదగ్గ పండగలేమీ లేవు.

 

మరి ఇలాంటి టైమ్ లో ఆగస్ట్ ౧౫వ తేదీ వరకూ ఎన్టీఆర్ అభిమానులకి వెయిట్ చేయించడ కరెక్ట్ కాదని ఆలోచిస్తున్నారు. నిరుత్సాహంలో ఉన్న అభిమానుల్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉత్సాహం నింపాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో కోసం ఎలాంటి ముహూర్తాలని చూడట్లేదట. అన్నీ కుదురుకుని, షూటింగులకి అనుమతి దొరికితే వీలైనంత తొందరగా ఎన్టీఆర్ లుక్ ని రివీల్ చేసేద్దామనే అనుకుంటున్నారట.

 

అంటే ఎన్టీఆర్ అభిమానుల కోసం ఎన్టీఆర్ గిఫ్ట్ రెడీ కాబోతోందన్నమాట. అది కూడా చాల త్వరగానే. ఆల్రెడీ ఏపీలో షూటింగ్స్ కి అనుమతి లభించినందున తెలంగాణలోనూ మరికొద్ది రోజుల్లో అనుమతులు రానున్నాయని అర్థం అవుతుంది. కాబట్టి ఎక్కువ రోజులు వెయియ్ చేయకుండానే అభిమానులు ఆశలు తీరనున్నాయి. రాజమౌళీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: