రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన రెబల్ సినిమా 2012 సంవత్సరంలో విడుదల కాగా... ఇందులో ప్రభాస్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాగా... దీక్షాసేత్ కూడా ద్వితీయ హీరోయిన్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో రిషి అనే ఒక యువకుడి క్యారెక్టర్ లో ప్రభాస్ నటించాడు. స్టీఫెన్, రాబర్ట్స్ ని వెతకడానికి హైదరాబాద్ కి వచ్చి నరసరాజు (బ్రహ్మానందం) సహాయం తీసుకుంటాడు. ఈ క్రమంలోనే హిప్ హాప్ డాన్సర్ నందిని ని తాను కలుసుకోవాలని తెలుసుకుంటాడు. ఆమె బ్యాంకాక్ లో ఉందని తాను కూడా బ్రహ్మానందాన్ని పక్కన పెట్టుకొని బ్యాంకాక్ కి బయలుదేరి ఆమెను తన ప్రేమలో పడేయాలని ప్రయత్నిస్తాడు. అయితే నందిని రిషి తో ప్రేమలో పడిన తర్వాత రచయితని కావాలని ప్రేమించలేదని వేరే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ప్రేమించాలని తెలుసుకొని షాక్ అవుతుంది. అప్పుడు ప్రభాస్ తన గతం గురించి నందినికి చెప్తాడు. ఆ తర్వాత ఏమైందనేది ఈ సినిమాలో చూపించబడింది. 


ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు. పిరికి కొడుకు పాత్రలో, ప్రేమికుడి పాత్రలో, గ్యాంగ్ స్టార్ పాత్రలో చాలా అద్భుతంగా నటించి అభిమానులకు కన్నుల విందు చేసిన ప్రభాస్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచేసుకున్నారు. డాన్ భూపతి పాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు అద్భుతంగా నటించాడు. తమన్నా చాలా గ్లామరస్గా ఈ సినిమాలో నటించింది అలాగే గూగుల్ సెర్చ్ లో నా అనే పాటకు తాను అద్భుతంగా డాన్స్ చేసే అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది. విలన్ పాత్రలో నటించిన ప్రదీప్ రావత్ ముఖేష్ రుషి అన్ని సినిమాల్లో లాగానే చాలా బాగా నటించారు. బ్రహ్మానందం జోకులు కొన్ని ఉన్నాయి కానీ సినిమా మొత్తంలో తన క్యారెక్టర్ ఎక్కువ సమయం కనిపించదు. 


అయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే, స్క్రిప్టు పై రాఘవ లారెన్స్ ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. అచ్చం డాన్, మాస్, కాంచన మూవీస్ లాగానే ఈ సినిమాలో కూడా ఎన్నో సన్నివేశాలను రిపీట్ చేసి రెబల్ సినిమా ని పాడు చేసాడు. అమ్మాయిలు హీరోతో ఫైట్ చేసే సన్నివేశం ఇంకా తదితర ఆల్రెడీ ప్రేక్షకులు చూడడంతో ఈ సినిమాలో ఆ సన్నివేశాలు అంతగా అలరించలేదు. అత్యద్భుతమైన హాస్యనటి కోవై సరళ ఈ సినిమాలో నటించింది కానీ తనకు మంచి సన్నివేశాలు ఇవ్వడంలో డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఫెయిల్ అయ్యాడు. అలీ కూడా బ్యాడ్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను అలరించలేకపోయాడు. ఏదిఏమైనా మాస్ సినిమా రెబెల్ కేవలం ప్రభాస్ అభిమానులను అలరించడం తప్ప మిగతా అభిమానులకు నిరాశను మిగిల్చింది. డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి అద్భుతమైన హిట్లను తన సొంతం చేసుకున్న ప్రభాస్ రెబల్ లాంటి రొటీన్ బోరింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెగాస్టార్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ డిజాస్టర్ సినిమా తర్వాత రాఘవ లారెన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పి తమిళంలోకి మకాం మార్చాడు అంటే రెబెల్ తనని ఎంత నిరాశపరిచిందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: