తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమ అలనాటి రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్ మొదటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ని మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఆకర్షిస్తూ వచ్చాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చత్రపతి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు వరల్డ్ వైడ్  హీరోగా మారిపోయాడు ప్రభాస్. బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఎక్కడికొ వెళ్ళిపోయింది. అయితే ప్రభాస్ కెరీర్ లో ఎన్నో అంచనాలకు మించిన విజయాలతో పాటు అంచనాలను తారుమారు చేసిన  అపజయాలు కూడా ఉన్న విషయం తెలిసిందే. 

 


 ఇలా ప్రేక్షకుల్లో ఎంతో  అంచనాలను కలిగించి ఆ తరువాత ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా సినిమాల్లో  మొదట గుర్తొచ్చేది రెబల్. రెబల్ స్టార్ ప్రభాస్ లోని రెబల్ అనే పదాన్ని సినిమా గా తెరకెక్కించారు లారెన్స్. దర్శకుడు నటుడు డాన్స్ మాస్టర్  అయిన లారెన్స్ రెబల్ సినిమాను తెరకెక్కించారు. పగ ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో ప్రభాస్ లుక్... ప్రభాస్ బాడీ... ప్రభాస్ డాన్సులు... చాలానే ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఇండస్ట్రీ హిట్ గా నిలిచి పోతుంది అని ప్రేక్షకులు భావించారు. 

 

 కానీ ప్రేక్షకుల అంచనాలు అన్నీ తారుమారు అయిపోయాయి. దీంతో భారీ అంచనాలతో విడుదలైన రెబల్ సినిమా కనీసం యావరేజ్ టాక్  కూడా తెచ్చుకోలేకపోయింది. భారీ యాక్షన్ సినిమా గా తెరకెక్కిన రెబల్ సినిమా ప్రేక్షకులకు నిరాశే మిగిల్చింది అని చెప్పింది. ఇక ఈ సినిమా ద్వారా అటు నిర్మాతలు కూడా భారీగా నష్టపోయారు. అయితే అప్పట్లో రెబల్ సినిమా కోసం దర్శకుడు నటుడు అయిన లారెన్స్ ఏకంగా మ్యూజిక్ కూడా కంపోజ్ చేశాడు కానీ అప్పట్లో వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన  విజయం సాధించలేకపోయింది. ప్రభాస్ కెరియర్లో బిగ్ డిజిస్టార్  గా మిగిలిపోయింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: