ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల హవా ఎక్కువగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఏదైనా మల్టీస్టారర్ సినిమా  వస్తుంది అంటే దాని మీద అంచనాలు పెరిగి పోతూ ఉంటాయి. ప్రేక్షకులు ఊహించని సరికొత్త కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా వస్తుందంటే ఆ అంచనాలకు హద్దే ఉండదు. ఇలా ఎవరూ ఊహించని ఎవరు అనుకొని మల్టీస్టారర్ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలను కలిగించింది కానీ ఆకట్టుకోలేక పోయింది. ఆ సినిమా ఏదో కాదు విక్టరీ వెంకటేష్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోలుగా మల్టీస్టార్ గా తెరకెక్కిన చిత్రం మసాలా. ఈ సినిమాలో వెంకటేష్ చెప్పే డైలాగులు అక్కడక్కడా ప్రేక్షకులకు నవ్వు తెప్పించినప్పటికీ ఎక్కువ మొత్తంలో మాత్రం చిరాకు తెప్పిస్థాయి . 

 


 ఇక రామ్ కూడా డిఫరెంట్ గెటప్ లో కనిపించినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. ఈ సినిమా స్టోరీ కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. అయితే ఎవరూ ఊహించని కాంబినేషన్ ఆయన విక్టరీ వెంకటేష్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ టీజర్ విడుదలై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. కానీ చివరికి విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఒక పెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిచిపోయింది మసాలా. 

 


 అయితే హిందీ సినిమా నుంచి తెలుగు రీమేక్  చేశారు మసాలా సినిమాను . అయితే హిందీలో మంచి విజయం సాధించినప్పటికీ తెలుగులో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది మసాలా సినిమా . దీంతో వెంకటేష్ కెరీర్పై ఈ సినిమా బాగానే ప్రభావం చూపింది. అప్పటికే వరుస ప్లాప్ సినిమాలతో వెంకటేష్ అయోమయంలో ఉండగా ఈ సినిమా వెంకటేష్ కెరీర్ పై మరింత తీవ్ర ప్రభావం చూపింది. అటు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్పై కూడా ప్రభావం చూపింది మసాలా సినిమా. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీలోనే  డిజాస్టర్ గా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: