తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో మధురమైన పాటలు,డైలాగ్స్ రాసి షభాష్ అనిపించుకున్న ప్రముఖ గేయ రచయిత ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ అంటే తెలియని వారు ఉండరు.  బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాల్లో జడ్జీగా వ్యవహరిస్తూ వస్తున్నారు.  తాజాగా   సుద్దాల అశోక్ తేజ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. గ‌చ్చిబౌలిలోని ఏషియ‌న్ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీలో చికిత్స పొందుతున్న ఆయ‌న‌కి వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.  ఆయ‌న బ్ల‌డ్ గ్రూప్  బీ నెగెటివ్ కాగా, శ‌స్త్ర చికిత్స స‌మ‌యంలో రక్తం కావ‌ల‌సి ఉంటుంద‌ని , అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోమ‌ని స‌న్నిహితుల‌కి చెప్పిన‌ట్టు స‌మాచారం.  ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా.. ఆయన్ని పరీక్షించిన వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రక్తం కొరత విపరీతంగా ఉంది.

 

ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ బ్లడ్ గ్రూప్ B నెగిటివ్ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో ఈ బ్లడ్ గ్రూప్ కోసం ఎదురుచూస్తున్నారు.  సొంత ఊరు సుద్దాల‌ని త‌న ఇంటి పేరుగా మార్చుకున్న ఈయ‌న నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. సినీ నటుడు ఉత్తేజ్‌కి సుద్దాల‌ మేనమామ కావడం వల్ల పరిశ్రమకు పరిచయం కావడం అంత కష్టం కాలేదు. తనికెళ్ళ భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించాడు.  సుద్దాల అశోక్ తేజ.. అనేక విప్లవ గీతాలతో క్లాసిక్ సాంగ్స్‌ను రాశారు.

 

నేను సైతం (ఠాగూర్), ఒకటే జననం.. ఒకటే మరణం (భద్రాచలం), ఇనుములో ఒక హృదయం మొలిచెనే (రోబో), నువ్ ఏడికెళ్తే ఆడికొస్తా సువర్ణా, వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే (ఫిదా) వంటి సూపర్ హిట్స్ సాంగ్స్ రాశారాయన. అంతే కాదు ఆయన రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో మూడు పాటలు రాసినట్లు సమాచారం.  ఎన్నో అద్భుత‌మైన గేయాల‌తో అల‌రించిన ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: