తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే గతంలో వరుస ప్లాపులతో సతమతం అయిన మహేష్ బాబు ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నారు. అంతే కాకుండా ఎక్కువగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ మరింత ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు మహేష్ బాబు. అయితే శ్రీమంతుడు అనే సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఒక బాధ్యతగల పౌరుడిగా.. ఊరిని బాగు చేసే యువకుడిగా మహేష్ బాబు తన నటనతో ఆకట్టుకున్నాడు. 

 

 ఇక మహేష్ బాబు కెరీర్లో ఈ సినిమా బ్లాక్బస్టర్ విజయంగా నిలిచింది అనడంలో అతిశయోక్తి. అయితే ఈ సినిమా తర్వాత బ్రహ్మోత్సవం అనే సినిమాలో నటించారు మహేష్ బాబు.ఈ సినిమాలు భారీ తారాగణం కనిపిస్తుంది. ప్రతి సీన్ లో ఎంతో రాయాలటి కనిపిస్తోంది. కానీ స్టోరీ విషయంలో మాత్రం దర్శకుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తుండడం ఈ సినిమాలో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా కనిపించడం తో... ఈ సినిమా కూడా శ్రీమంతుడు సినిమా ల మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం ఖాయం అని అనుకున్నారు. 

 


 కానీ ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేసింది ఈ సినిమా. బ్లాక్ బస్టర్ విజయం కాదు కదా కనీసం యావరేజ్ టాక్ కూడా  సొంతం చేసుకోలేక పోయింది. దీంతో భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా  నిర్మాతలను నష్టాల పాలు చేసింది అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుతో సహా భారీ తారాగణం ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా టేకింగ్ మొత్తం సీరియళ్లను తలపించేలా ఉంటుంది. ప్రస్తుతం ధారావాహికల్లో ఎలాగైతే ఉంటుందో ఈ సినిమా చూస్తున్నంత సేపు సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది  ప్రేక్షకులకు.

మరింత సమాచారం తెలుసుకోండి: