తెలుగు సినిమా పరిశ్రమలో సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. సంస్థను ప్రారంభించిన రామానాయుడు ఈ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలనే కాకుండా ఎన్నో మరపురాని చిత్రాలను నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామానాయుడు నిర్మాతగా తీసిన తొలి సినిమా ‘రాముడు భీముడు’. నటరత్న ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించిన సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమా విడుదలై నేటితో 56 ఏళ్లు పూర్తయ్యాయి. తెలుగు సినిమా చరిత్రలో అద్భుతమైన క్లాసిక్ మూవీగా రాముడు-భీముడు కు పేరు ఉంది.

IHG

 

ఎన్టీఆర్ కెరీర్లోనే తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా 1964 మే21న విడుదలైంది. సినిమా రంగంలో అడుగుపెట్టి తొలిసారి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కించారు రామానాయుడు. రామారావు అత్యద్భుతమైన నటనతో ఈ సినిమా ఆద్యంతం అలరించారు. మంచి కథా బలమున్న ఈ సినిమా అఖిలాంధ్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికీ ఓ సినిమాలో హీరోలు డ్యూయల్ రోల్ చేస్తే రాముడు – భీముడు తరహాలో డ్యూయల్ రోల్ అనే మాట శాస్వతంగా ఉండిపోయింది. ద్విపాత్రాభినయాలకు ఈ సినిమా కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. హీరోయిన్లుగా జమున, ఎల్. విజయలక్ష్మి నటించారు. ఈ సినిమా సాధించిన అఖండ విజయంతో తెలుగు సినిమాల్లో సురేశ్ బ్యానర్ కు ఎర్ర తివాచీ పరచుకుంది.

IHG

 

తాపీ చాణక్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కథా రచయిత నరసరాజు రాసిన ఈ కథను మొదట్లో సినీ దిగ్గజాలు నాగిరెడ్డి – చక్రపాణి నిరాకరించారట. కానీ ఈ సినిమా సాధించిన అఖండ విజయంతో అదే నాగిరెడ్డి, చక్రపాణి రీమేర్ రైట్స్ తీసుకుని తమిళ్ లో ఎంజీఆర్ తో చేశారు. ఈ సినిమా అటు ఎన్టీఆర్ కు, ఇటు రామానాయుడుకు మరపురాని సినిమాగా తెలుగు సినిమా క్లాసిక్ గా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: