టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ స్టార్లు గా ఎంతో గొప్ప పేరు, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉంటారు. కాగా రెండేళ్ల క్రితం వచ్చిన అజ్ఞాతవాసి సినిమాతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో నిమగ్నం అయిన పవన్, ఇటీవల మళ్ళి ముఖానికి మేకప్ వేసుకుని సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా వకీల్ సాబ్, అలానే క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ మూవీ తెరకెక్కుతున్నాయి. మరోవైపు దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి తొలిసారిగా ఆర్ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇకపోతే వీరిద్దరి కెరీర్ లో మంచి హిట్స్ తో పాటు మధ్యలో కొన్ని ఘోరమైన ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. 

 

అయితే వాటిలో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో వచ్చిన సర్ధార్ గబ్బర్ సింగ్ అప్పట్లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాకి బాబీ దర్శకత్వం వహించగా, శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి పవన్ తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో దీనిని నిర్మించడం జరిగింది. 2016లో ఎన్నో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కాగా ఆ సినిమా వల్ల చాలామంది బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎంతో భారీగా నష్టాలు ఎదుర్కోగా, ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ ఒకరు తనకు ఎంతో భారీ లాస్ వచ్చిందని హైదరాబాద్ లోని పవన్ ఇంటి వద్ద టెంట్ వేసి ధర్నా చేసిన ఘటన అప్పట్లో వైరల్ అయింది. 

 

ఇకపోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో 2005లో వచ్చిన నరసింహుడు సినిమా, ఎన్టీఆర్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చెంగల వెంకట్ రావు ఎంతో భారీ ఖర్చుతో నిర్మించిన ఈ సినిమా, రిలీజ్ తరువాత పెద్ద ఫ్లాప్ ని మూటగట్టుకోవడంతో ఒకానొక సమయంలో నిర్మాత వెంకట్ రావు హైదరాబాద్ లోని మూసి నదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసారు. అయితే ఆయన ఆత్మహత్య ప్రయత్నానికి అసలు కారణం వెలుగులోకిరానప్పటికీ, అప్పట్లో నరసింహుడు సినిమా వేసిన దెబ్బ ఆయనను ఎంతో కృంగతీయడం వల్లనే ఆయన ఆ విధంగా ఆత్మహత్య చేసుకోబోయారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఒకరకంగా ఈ ఇద్దరు హీరోల కెరీర్ లో ఈ రెండు సినిమాలు కూడా కొంత మాయని మచ్చ వేసాయి అనే చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: