తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా యావత్ భారతదేశ సినీ పరిశ్రమలోనే సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలతో కలుపుకుంటే ఈ బ్యానర్ నుంచి ఇప్పటి వరకూ 125 సినిమాలు వచ్చాయి. ఇదొక ఘనమైన చరిత్ర. ఈ బ్యానర్ ను భారతీయ చిత్ర పరిశ్రమలోనే మణి మకుటంలా తీర్చిదిద్దారు. తొలి సినిమాగా ఎన్టీఆర్ తో రాముడు-భీముడు సినిమా తీశారు. ఈ సినిమా అఖండ విజయం సాధించడంతో తెలుగు సినిమాల్లో రామానాయుడు ప్రస్థానం ఘనంగా ప్రారంభమైంది. అనంతర కాలంలో రామానాయుడు మూవీ మొఘల్ గా ఎదిగారు

IHG's residence ...

 

సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో రామానాయుడు వరుసగా సినిమాలు నిర్మించారు. అయితే ఆశించిన ఫలితాలివ్వలేదని ఆయనే ఓ సందర్భంలో చెప్పారు. అనేక ప్రయత్నాల అనంతరం ఆయన అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ కాంబినేషన్ లో 1971లో తెరకెక్కించిన సినిమా ‘ప్రేమ్ నగర్’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి భారీ లాభాలతో రామానాయుడు తిరుగులేని కెరీర్ కు నాంది పలికింది. ఈ సినిమా తర్వాత రామానాయుడు తిరిగి చూసింది లేదు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. రూపాయి నోటుపై ఉన్న భారతీయ భాషలన్నింటిలో సినిమా తీయాలనే ఆయన కల నెరవేర్చుకుని గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించారు.

IHG

 

రామానాయుడు ఘన వారసత్వాన్ని సురేశ్ బాబు ప్రొడ్యూసర్ గా, వెంకటేశ్ సూపర్ స్టార్ గా రాణించి విజయవంతంగా కొనసాగుతున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ సింబల్ పై ఎస్ అక్షరంపై సురేశ్ బొమ్మను, పి అక్షరంపై వెంకటేశ్ ను పెట్టారట. అందుకు తగ్గట్టే సరేశ్ నిర్మాతగా, వెంకటేశ్ స్టార్ గా ఎదిగారని సరదాగా అనేవారు రామానాయుడు. ఆయన కుటుంబం నుంచి మూడో తరం నటుడిగా దగ్గుబాటి రానా సినిమాల్లో రాణిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: