ఇటీవల కాలంలో అమితాబ్ బచ్చన్ ఎక్కువగా జిమ్(వ్యాయామశాల) లో సమయాన్ని గడుపుతున్నాడు. అలాగే తాను చేస్తున్న వ్యాయామానికి సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతా లో పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేందుకు ఈ బాలీవుడ్ అగ్ర సీనియర్ హీరో తన ఇంట్లోనే ఏర్పాటుచేసిన జిమ్ లో వ్యాయామం చేస్తున్నాడు. అలాగే తన అభిమానులు కూడా వ్యాయామం చేయాలని చెబుతున్నాడు. తాజాగా తాను తన కుమార్తె శ్వేతా బచ్చన్ నంద కుమారుడైన ఐన అగస్త్య నంద తో కలసి ఒక ఫోటో దిగి ఆ ఫోటో ని తన ఇంస్టాగ్రామ్ ఖాతా లో పోస్ట్ చేశాడు. ఈ 77 ఏళ్ల ఆజానుబాహుడు తన ఫోటో కి ఈ విధంగా క్యాప్షన్ పెట్టాడు... " ఫైట్... ఫిట్నెస్ కోసం ఫైట్ చేయండి... నా మనవడి ని చూసి ఇన్స్పైర్ అవుతున్నాను' అని పేర్కొన్నాడు. 

IHG
పైన కనబడుతున్న బ్లాక్ ఫోటోలో అమితాబ్ బచ్చన్, అగస్త్య నంద తమ సొంత జిమ్లో నిల్చొని డంబెల్స్ పట్టుకొని ఉన్నారు. అమితాబ్ బచ్చన్ ఈ జిమ్ వర్క్ అవుట్ లో స్లీవ్లెస్ టీ షర్ట్, పైజామా వేసుకున్నాడు. తలకి బీని కూడా వేసుకున్నాడు. ఈ ఫోటో అప్లోడ్ చేసే ముందు రోజు కూడా అమితాబ్ బచ్చన్ ఫ్రీ వర్కౌట్ సెల్ఫీ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఫిట్ నెస్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 77ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని నిలువెత్తు విగ్రహంలా అమితాబచ్చన్ ఉండటం ప్రస్తుతం అందరికి స్ఫూర్తినిస్తోంది. 

IHG
తన ఆరోగ్యం బాగుండాలని ఉద్దేశంతో అమితాబ్ బచ్చన్ కేవలం శాకాహారాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. శాకాహారం ఎక్కువగా తినడం వలన శరీరంలోని కణజాలం ఎక్కువ కాలం పాటు బతుకుతుంది. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలోని జన్యువులు త్వరగా క్షీణించిపోయి మరణం తక్కువ సమయంలోనే సంభవిస్తుంది. హాలీవుడ్ నటి నటులు కూడా శాకాహారాన్ని తినడానికే మొగ్గుచూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: