ఏడాదిన్నర కు పైగా గ్యాప్ ఇచ్చి ‘అల వైకుంఠపురంలో’ సినిమా తో ఈ ఏడాది ప్రారంభం లో బన్నీ అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులను పగలగొట్టి కొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా విజయంతో  త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హ్యాట్రిక్ విజయం సాధించినట్లు అయ్యింది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ రూపంలో సినిమాలను తెరకెక్కించే సూపర్ స్పెషాలిటీ డైరెక్టర్ మారుతి ఇటీవల బన్నీ కి ఓ స్టోరీ చెప్పి సూపర్ ఇంప్రెస్ చేశాడట. స్టోరీ బాగా నచ్చడంతో నైట్ మొత్తం బన్నీ మారుతీ రాసిన స్క్రిప్ట్ చదివి ఫుల్ ఎంజాయ్ చేశాడట.

 

దీంతో మారుతి సినిమా బన్నీ ఓకే చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. మెగా కాంపౌండ్ హీరోలతో మంచి అనుబంధం ఉన్న మారుతి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మంచి మంచి సినిమాలు చేయటం జరిగింది. దీంతో ఆ చనువుతో అల్లు అర్జున్ తో మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ బన్నీతో ఎప్పుడు వాట్సప్ లో టచ్ లో ఉంటానని తెలపడంతో వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని అర్థమవుతుంది. వాస్తవంగా అల్లు శిరీష్ నటించిన ‘కొత్త జంట’ సినిమా స్క్రిప్టు బన్నీ కోసం మారుతి రాసుకున్నాడట.

 

ఈ స్క్రిప్ట్ బన్నీకి అప్పట్లో వినిపించగా ఇది తన తమ్ముడికి  అయితే బాగుంటుందని అలా సెట్ చేసి అల్లు శిరీష్ తో మారుతి సినిమా చేయడానికి బన్నీ కారకుడని ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల మారుతి చెప్పిన స్క్రిప్ట్ కి బన్నీ ఓకే చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు జోరుగా వినబడుతున్నాయి. సూపర్ ఎంటర్టైన్మెంట్ కలిగిన ఈ స్క్రిప్ట్ ఖచ్చితంగా చేస్తానని బన్నీ మారుతికి  మాట ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ‘ఐకాన్’ అనే సినిమా కూడా లైన్ లో పెట్టడం జరిగింది. అయితే ఈ రెండు సినిమాల మధ్య కాస్త గ్యాప్ దొరికే అవకాశం ఉందట. ఆ గ్యాప్ లో మారుతి దర్శకత్వంలో బన్నీ సినిమా చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: