మహేశ్ బాబు కూడా త్వరలో సిక్స్ ప్యాక్ చూపించనున్నాడా.. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ రిలీజ్ తర్వాత మహేశ్ కూడా ఈ లిస్ట్ లో చేరతాడనిపిస్తోంది. షర్ట్ లేకుండా  కనిిపంచాలనుకుంటున్న మహేశ్ డ్రీమ్ తీరుతోంది. సైలెంట్ సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడన్న వార్తకు ట్రైనర్ మాటలు బలం చేకూర్చాయి. 

 

సల్మాన్ ఖాన్ కండల వీరుడు అనిపించుకోవాలన్న కోరిక మహేశ్ కు చాలా కాలంగా ఉంది. క్యూట్ గా మిల్కీబాయ్ లా కనిపించే మహేశ్ కు కండలు చూపించే అవసరం రాలేదు. అయితే సిక్స్ ప్యాక్ మెయిన్ టైన్ చేయాలన్న డ్రీమ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఒన్ సినిమాలో ట్రై చేసినా.. ఓసీన్ లో బ్యాక్ నుంచి మాత్రమే బాడీని చూపించాడు. ఆ తర్వాత కండలు చూపించాల్సిన అవసరం రాలేదు. 

 

తోటి హీరోలు.. ఎన్టీఆర్.. రామ్ చరణ్.. ప్రభాస్.. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ చేసి సక్సెస్ అయ్యారు. దీంతో మహేశ్ దృష్టి కూడా ఆరుపలకలపై పడింది. లాక్ డౌన్ సమయంలోనూ ఇంట్లో ఉన్న జిమ్ లో కంటిన్యూస్ గా కసరత్తులు చేస్తున్నాడు. అలాగే.. సితారతో కలిసి దిగిన ఫోటో.. జిమ్ బాడీతో కనిపించాడు మహేశ్. ఈ లెక్కలన్నీ చూస్తుంటే పరశురామ్ సినిమాలో షర్ట్ తీస్తాడా.. లేదంటే రాజమౌళి సినిమా కోసం దాచిపబెట్టుకుంటాడో చూడాలి. 

 

మహేశ్ ఫిట్ నెస్ సీక్రెట్ గురించి జిమ్ ట్రైనర్ మినాష్ గాబ్రియేల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అథ్లెట్స్ మొదలుకొని బాలీవుడ్ స్టార్ హీరోల వరకు చాలామంది ఈయన దగ్గరే ఫిట్ నెస్ లో ట్రైన్ అయ్యారు. మహర్షి మూవీ కోసం మహేశ్ ఫిట్ నెస్ ట్రైనర్ గా వర్క్ చేశాడు. మహేశ్ తో పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందనీ.. కమిట్ మెంట్.. డెడికేషన్ ఉన్న నటుడని ట్వీట్ చేశాడు మినాష్.మహేశ్ తో ఉన్న ఫోటో పోస్ట్ చేస్తూ.. మళ్లీ కలిసి పనిచేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నానన్నాడు ఈ ప్రొఫెషనల్ ట్రైనర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: