IHG

ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం కెజిఎఫ్ చాఫ్టర్ 1 . హీరో యష్ ఈ చిత్రం తో గొప్ప విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాఖి భాయ్ గా యష్ అలరించాడు. అయితే కెజిఎఫ్ 2 కోసం యావత్ భారత దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంది. ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ని నిలిపివేసుకుంది. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను లాక్ డౌన్ కాలంలో పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నం చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

 

IHG

గత కొద్దీ రోజుల క్రితం హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ పనులను పూర్తి చేసింది. కన్నడ రాష్ట్రంలో ఈ సినిమాపై పిటిషన్లు దాఖలు కావడంతో షూటింగ్‌ను హైదరాబాద్‌కు మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది ఏకంగా 120 కోట్లా సాటిలైట్ హక్కులను పొంది ఇండియా లోని  అన్ని సినీ పరిశ్రమలను అబ్బురపరిచింది. అయితే కెజిఎఫ్ 2 తెలుగు రైట్స్ ను నిర్మాత దిల్ రాజు పొందినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎంత మొత్తంలో ఈ హక్కులను కొన్నది వెల్లడించలేదు. అయితే ఓ ఫ్యాన్సీ రేటుకే అయన కొని ఉంటాడని చెప్పుకుంటున్నారు. అయితే ఈ చిత్రం లో పలువురు బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ నటులు ఇందులో నటిస్తున్నారు .ముఖ్యంగా సంజయ్ దత్ , రవీనా టాండన్, రావురమేష్ లు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: