మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2,345 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయిదీనిని బట్టి మహారాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం అయితే మరీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి

 

64 మరణాలు కూడా ఒక్క రోజే సంభవించడం గమనార్హం. ఒక్క రోజులోనే 2 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు మహారాష్ట్రలో నమోదవడం ఇది రెండోసారి. మే 17 అత్యధికంగా 2347 కేసులు నమోదయ్యాయి. రోజు ఒక్క రెండు కేసులతో రికార్డు మిస్ అయ్యింది అంతే. అయితే దేశంలో ఎక్కడా స్థాయిలో కరోనా వైరస్ ప్రభావం లేదు

 

దీంతో ధారావి ప్రాంతంలో కేంద్ర సాయుధ బలగాలు (సీఏపీఎఫ్‌) మోహరించాయి. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు రాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు కేంద్రం సీఏపీఎఫ్‌ బలగాలను మహారాష్ట్రకు తరలించిందినిన్న రాత్రి సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది బెండీ బజార్‌లో కవాతు నిర్వహించారని అధికారులు వెల్లడించారు. ముంబైలో సోమవారం ఐదు కంపెనీల సీఏపీఎఫ్‌ బలగాలను మోహరించినట్టు అధికారులు పేర్కొన్నారు

 

ఇక ఈ పరిస్థితి ఈ రోజు మహారాష్ట్ర కి వచ్చింది రేపు సరైన ముందుచూపు చర్యలు లేKఅపోతే మరొక రాష్ట్రానికి వస్తుంది.... చివరికి అక్కడకీ మిలిటరీ వస్తుంది. ఇదే స్థాయిలో కేసులు నమోదయితే రాష్ట్రం, సీఎం తో సంబంధం లేకుండా పరిస్థితిని అదుపు చేసేందుకు సీఆర్పీఎఫ్ బలగాలు దిగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయిముఖ్యమంత్రి కొత్తవారని.. కొత్త ప్రభుత్వానికి పరిపాలన చేసేంత అనుభవం లేదని ఫడ్నవీస్‌ మండిపడ్డారుదేశంలోనే కరోనా మహమ్మారి అధికంగా విజృంభిస్తోన్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఘనత సాధించిందని ఆయన ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: