కొన్నిసార్లు టాలెంట్ ఉన్నా సరే సరైన సినిమాలు చేయక కెరియర్ లో వెనుకాపాడాల్సి వస్తుంది. ప్రస్తుతం సుధీర్ వర్మ పరిస్థితి అలానే ఉంది. స్వామిరారా సినిమాతో దర్శకుడిగా తన ముద్ర వేసుకున్న సుధీర్ వర్మ ఆ తర్వాత సినిమాలు ఆ రేంజ్ లో తీయకపోయేసరికి కెరియర్ లో చాలా వెనుకపడ్డాడు. చేస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందుకోవడం లేదు. అందుకే అతనితో సినిమా అంటే హీరోలు, నిర్మాతలు దూరమవుతున్న్నారు. 


స్వామిరారా హీరోతో కేశవ.. యువ హీరో శర్వానంద్ తో రణరంగం సినిమాలు చేసిన సుధీర్ వర్మ తన నెక్స్ట్ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తాడని అంటున్నారు. థ్రిల్లర్ కథతో బెల్లంకొండ హీరోని మెప్పించాడట సుధీర్ వర్మ. అల్లుడు శీనుతో హీరోగా తెరంగేట్రం చేసి రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు అల్లుడు అదుర్స్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక తన నెక్స్ట్ సినిమా సుధీర్ వర్మతో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు బెల్లంకొండ బాబు. 


థ్రిల్లర్ కథ అంటున్నాడు అంటే ఈసారి సుధీర్ వర్మ హిట్ కొట్టాలన్న కసితో వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా కమర్షియల్ హిట్ బొమ్మ కోసం ఎదురుచూస్తున్నాడు. అది సుధీర్ వర్మ సినిమా అవుతుందనే అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. స్వామిరారా తరువాత సరైన హిట్టు లేక సతమతమవుతున్న సుధీర్ వర్మకు ఇదో మంచి అవకాశమని చెప్పొచ్చు. తప్పకుండా యువ హీరో.. టాలెంటెడ్ డైరక్టర్ ఇద్దరు కలిసి అద్భుతాలు చేస్తారని ఆశిస్తున్నారు ఆడియెన్స్. ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా థ్రిల్లింగ్ గా రాసుకున్నాడట సుధీర్ వర్మ. 

మరింత సమాచారం తెలుసుకోండి: