ఒక భాషలో రిలీజ్ అయి సక్సెస్ అయిన సినిమాలో మరో భాషలోకి డబ్‌ చేయటం ఇప్పుడు తరచూ చూస్తున్నాం. కానీ గతంలో అలా కనిపించేవి కాదు. భారీ విజయం సాధించిన సినిమాలను మాత్రమే అది కూడా పర భాషలోనూ సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంటేనే ఆ సినిమాలను మరో భాషలోకి డబ్‌ చేసే వారు. అలా ఇతర భాషలోకి డబ్‌ అయిన తొలి తెలుగు సినిమా కీలు గుర్రం. అక్కినేని నాగేశ్వరరావు, అంజలి దేవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ ఫాంటసీ సినిమాను తొలిసారిగా తమిళ్‌లోకి డబ్ చేసి రిలీజ్‌ చేశారు.

 

అప్పట్లో షూటింగ్ లైవ్‌ రికార్డింగ్‌ టెక్నాలజీతోనే తెరకెక్కించేవారు. అయినా కానీ డబ్బింగ్ చెప్పింది తమిళ్‌లో రిలీజ్ చేయటం అనేది అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది. రాజా సాహిబ్‌ ఆఫ్ మీర్జాపురం నిర్మించిన ఈ సినిమాకు తాపి ధర్మరావు దర్శకుడు. 1949 ఫిబ్రవరి 19న రిలీజ్‌ అయిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో తమిళ్‌లోకి డబ్‌ చేశారు. అక్కినేని, అంజలీ దేవిలకు తమిళ్‌లో కూడా ఫాలోయింగ్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు చిత్రయూనిట్‌.

 

విదర్బ అనే రాజ్యానికి రాజు వేటకు వెళ్లిన సమయంలో ఓ రాక్షసిని అందమైన అమ్మాయిగా భావించిన ఆమెను మోహించి రెండో భార్యగా చేసుకుంటాడు. అయితే రాజ్యానికి వచ్చిన రాక్షసి రాజ్యంలోని ఏనుగులు, గుర్రాలను తినేస్తుంది. ఆ నెపాన్ని రాణీ మీద వేస్తుంది. దీంతో రాజు రాణిని చంపేయాలని సైనికులను ఆదేశిస్తాడు. కానీ సైనికులు రాణి మీద కృతజ్ఞతతో ఆమెను చంపకుండా అడవిలో వదిలేసి వస్తారు. అప్పటికే గర్భవతి అయిన ఆమెకు హీరో జన్మిస్తాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన హీరో ఆ రాక్షసి ఆట ఎలా కట్టించాడు అన్నదే సినిమా కథ. అప్పట్లోనే ఫాంటసీ అంశాలతో తెరకెక్కించినా ఈ సినిమా సంచలన విజయం సాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: