రజని కాంత్ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా శివాజీ. ఈ సినిమాలో కథ తో పాటుగా కొన్ని సన్నివేశాలు రజని కాంత్ నటన.. అదే విధంగా సామాజిక కోణం లో చూపించిన విధానం అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అనే చెప్పవచ్చు. రజని ఈ సినిమా ద్వారా మరో సారి ఇండియన్ సినిమా ప్రేక్షకులతో పాటుగా ఇతర భాషల ప్రేక్షకులకు కూడా ఎంతగానో నచ్చారు అనేది వాస్తవం. ఇక రజని నటన చూసిన వారు అయితే చేస్తే ఇలాంటి సినిమాలు చేసుకోవాలి అనే విధంగా ఈ సినిమా ఉంది అని చెప్తూ ఉంటారు. 

 

అదే విధంగా సినిమాలో చూపించిన అవినీతి వ్యతిరేక సన్నివేశాలు అయితే ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక శ్రేయ విషయంలో రజని కాంత్ చూపించిన నటన ఆమె కోసం సినిమాలో అతను పడిన కొన్ని కష్టాలు కూడా ప్రేమ కోసం ఇలా కూడా చేయవచ్చా అనే విధంగా ఉన్నాయి అనేది వాస్తవం. రజని కాంత్సినిమా నుంచి ఆయనలో ప్రయోగాలు చేసే గుణం అనేది బయటపడింది. ఇక ఈ సినిమా దర్శకుడు శంకర్ కూడా ఈ సినిమా ద్వారా చాలా మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన సినిమాలు అంటే ఈ రేంజ్ లో ఉంటాయి అనే విధంగా ఈ సినిమా నిలిచింది అనేది వాస్తవం. 

 

ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఇక్కడి నుంచే ఎదురు చూడటం కూడా మొదలుపెట్టారు అనేది తెలిసిందే. ఈ సినిమా నుంచి చాలా మంది దర్శక నిర్మాతలు చాలా నేర్చుకున్నారు. దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది అనేది వాస్తవం. మన తెలుగులో ఇప్పటికి టీవీ లో వచ్చినా సరే ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. మన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: