మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ కోసం మన తెలుగు ఆడియన్స్ కు కూడా చాలా మందికి తెలుసు. తెలుగు ఆడియన్స్ కు మణిరత్నం దర్శకత్వంలో తీసిన 'ఓకే జాను' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా కీర్తి సురేష్ తో చేసిన 'మహానటి' చిత్రంతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అది లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడం వలన దానినే మనం తనకి హీరోగా తెలుగు డెబ్యూ చిత్రంగా చెప్పలేం. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి డబ్ కూడా అయ్యాయి. ఈ మధ్య విడుదలయిన 'కనులు కనులను దోచాయంటే' చిత్రం ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అప్పటి నుంచి నేరుగా ఓ తెలుగు సినిమా చేయాలని ఎదురు చూస్తున్న దుల్కర్ సల్మాన్ కు.. హను రాఘవ పూడి చెప్పిన స్క్రిప్ట్‌ నచ్చినట్లు సమాచారం. ఈ సినిమా ద్వారా దుల్కర్ సల్మాన్ సోలో డెబ్యూ గా టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు.

 

దుల్కర్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళం, తమిళ్‌ లో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. హిట్టు సినిమాలు తీసిన దర్శకులకే స్టార్ హీరోలు అవకాశం ఇవ్వని ఈ రోజుల్లో హను లక్కీ ఛాన్స్ కొట్టేశాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. టాలెంట్ ఉన్నా సక్సెస్ లేని  తెలుగు దర్శకుల్లో హను రాఘవపూడి మొదటి వరుసలో ఉంటాడు. ఫ్లాప్ డైరెక్టర్‌ గా ముద్ర పడిన హను రాఘవపూడి ఈ చిత్రం ద్వారా అయినా క్రేజీ దర్శకుల్లో ఒకడిగా నిలిచిపోతాడేమో చూడాలి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనున్నదని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దాని గురించి ఈ మధ్య చాలా రకాలుగా వార్తలు వస్తున్నాయి.

 

అయితే ఈ చిత్రానికి హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కథ పూజా వినగా ఈ లాక్ డౌన్ అనంతరం ఈ హైదరాబాద్ వచ్చాక సైన్ చేయనున్నట్టు సమాచారం. మరి వీరి కాంబోలో హను రాఘవ పూడి ఎలాంటి స్క్రిప్ట్ ను చూపిస్తారో చూడాలి. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా లక్కీ బ్యూటీగా కొనసాగుతున్న పూజా హెగ్డే దుల్కర్ సల్మాన్ కి కూడా హిట్ ఇస్తుందేమో చూడాలి. ఈ ఏడాది ప్రారంభంలో అల్లు అర్జున్ తో 'అల వైకుంఠపురంలో' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న 'బుట్ట బొమ్మ' పూజా హెగ్డే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా.. అక్కినేని వారసుడు అఖిల్ తో 'మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్' సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ఒక సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: