కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడమే కాదు షూటింగులకీ అంతరాయం ఏర్పడింది. నాలుగవ విడత లాక్డౌన్ లో అనేక సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం సినిమా హాళ్లకి మాత్రం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అలాగే షూటింగులకి కూడా పర్మిషన్ లభించలేదు. వందల మంది కలిసి పనిచేసే చోట జాగ్రత్తలు తీసుకోవడం కష్టమవుతుందన్న ఉద్దేశ్యంతో ఇంకా అనుమతులు లభించలేదు.

 

అయితే ఈ మేరకు ప్రభుత్వాలు తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. సినిమా రంగం నుండీ కూడా అనేక సలహాలు వస్తునాయట. అలా సలహా ఇస్తున్న వారిలో రాజమౌళి కూడా ఒకరు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ లాక్డౌన్ కారణంగా ఆలస్యమవుతూ వస్తుంది. ఇప్పటికే విడుదల తేదీని వాయిదా వేశారు. ఇంకా మరిన్ని రోజులు ఆగితే మరింతగా నష్టపోవాల్సి వస్తుంది.

 

అయితే కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే షూటింగ్స్ జరుపుకోవచ్చని రాజమౌళి చెబుతున్నాడట. ఎక్కువ మంది అవసరం లేకుండా కేవలం లిమిటెడ్ మెంబర్స్ తోనే షూటింగ్స్ కానిచేయచ్చని సలహా ఇస్తున్నాడట. ఈ మేరకు శాంపిల్ షూట్ తీసే ఆలోచన్లో ఉన్నట్టు చెబుతున్నారు. షూటింగ్ లొకేషన్లో జాగ్రత్తలు తీసుకుంటూ, అన్ని ప్రమాణాలు పాటిస్తూ, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూ షూట్ ని పూర్తిచేయవచ్చని చూపిస్తారట. 

 

ఒకవేళ ఆ శాంపిల్ షూట్ ఓకే అయితే గనక తెలంగాణలో ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ జరుపుకోవచ్చని అనుమతి లభిస్తుంది. తక్కువ మంది పనిచేసే షూటింగులన్నీ ఇప్పుడు తీసేసుకుని, ఎక్కువ మంది కావాల్సిన సీన్లని డిసెంబరులో చిత్రీకరించాలనే ప్లాన్ లో ఉన్నారట. ఏదైతేనే మరికొద్దొరోజుల్లో సినిమా షూటింగులకి అనుమతి వచ్చేలా కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా చూడాలి. ఇప్పటికే చిత్ర నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. అన్ని మెసర్ మెంట్స్ సరిగ్గా ఉంటే అనుమతి వచ్చే అవకాశాలే ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: