జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. వేణు వండర్స్ టీం లో ఎంట్రీ ఇచ్చి వేణు జబర్దస్త్ నుండి ఎగ్జిట్ అయ్యాక ఆ టీం లీడర్ గా మారి సూపర్ స్కిట్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. స్మాల్ స్క్రీన్ పై ఎంత క్రేజ్ వచ్చినా సినిమా హీరోకి వచ్చే క్రేజ్ ముందు తక్కువే. అందుకే హీరోగా మారాలని సుధీర్ కు ఆలోచన వచ్చింది. తన స్కిట్స్ లో కూడా అప్పుడప్పుడు నేను హీరో మెటీరియల్ అని డైలాగ్స్ వేస్తుంటాడు. 

 

ఐతే హీరోగా సినిమా చేయడం తేలికే కాని దాన్ని హిట్టు కొట్టడమే చాలా కష్టం. సుధీర్ హీరోగా వచ్చిన మొదటి సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్.. ఆ సినిమాలో తనలో ఉన్న అన్ని యాంగిల్స్ చూపించాడు సుధీర్. కానీ సినిమా మాత్రం ఆడియెన్స్ ను అలరించలేదు. ఆ సినిమా చూసి ఇది స్కిట్స్ లో కూడా చేస్తున్నాడు కదా అనుకున్నారు. ఇక రెండో ప్రయత్నంగా సుధీర్ టీం మేట్స్.. గెటప్ శ్రీను, ram PRASAD' target='_blank' title='ఆటో రామ్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆటో రామ్ ప్రసాద్, సన్నీలు కలిసి 3 మంకీస్ సినిమా తీశారు. కానీ అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియలేదు. అందుకే సుధీర్ మరోసారి ఆలోచనలో పడ్డాడు. హీరోగా ఎలాగైనా హిట్టు కొట్టి తీరాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఈ ప్రయత్నంలో సుధీర్ ప్రస్తుతం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమాతో సుధీర్ అనుకునే హిట్టు కొట్టేలా ఉన్నాడు. ఒకటి రెండు ప్రయత్నాలకే నిరాశచెందకుండా తాను హీరోగా సక్సెస్ అయ్యేంతవరకు సినిమాలు చేస్తూనే ఉంటానని అంటున్నాడు సుధీర్.

 

అంతేకాదు ఇక మీదట వేరే హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయనని.. చేస్తే హీరోగానే తప్ప మిగతా పాత్రలు చేయనని అంటున్నాడు. సునీల్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి ఇలా అందరు కమెడియన్స్ హీరోలుగా కష్టమని భావించి మళ్ళీ కమెడియన్స్ గా కొనసాగుతున్నారు. మరి సుధీర్ అయినా సక్సెస్ అవుతాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: