సినిమా పుట్టిన తరువాత ఇప్పటి వరకు ఇన్ని రోజులు సినిమాల నిర్మాణం సినిమాల ప్రదర్శన ఆగిపోలేదు. కరోనా విలయతాండవం నేపధ్యంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కనీవినీ ఎరుగని నష్టాలను ఎదుర్కుంటోంది. ఒకవైపు ఒటీటీ చాలవేగంగా జనం మధ్యకు దూసుకు వస్తుంటే ఆగిపోయిన సినిమాల షూటింగ్ ను ఎలా పూర్తి చేయాలో తెలియక అదేవిధంగా రిలీజ్ కు రెడీగా ఉన్న అనేకసినిమాలను ఎప్పుడు ఎలా విడుదలచేయాలో తెలియక ఇండస్ట్రీ వర్గాలు అతలాకుతలం అవుతున్నాయి.


వాస్తవానికి రెండవ ప్రపంచయుద్ధం సమయంలో సినిమాల షూటింగ్ లపై షరతులు విధించడం జరిగింది కాని ఇలా పూర్తిగా సినిమాల షూటింగ్ లు సినిమాల ప్రదర్శనలు ఆగిన సందర్భాలు లేవు. ఇలాంటి పరిస్థితులలో మూడవ ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్న ఈకరోనా పై చేస్తున్న యుద్ధంలో ఇండస్ట్రీని రక్షించడానికి నిన్న చిరంజీవి ఇంటిలో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల సమావేశం జరిగింది. 


ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన నాగార్జున రాజమౌళి కొరటాల శివ త్రివిక్రమ్ దిల్ రాజ్ సురేశ్ బాబు లతో సహా అనేకమంది ప్రముకులు ఈ సమావేశానికి వచ్చి షూటింగ్ లను ఎలా మొదలు పెట్టాలి అన్న విషయం పై చాల లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కరోనా పరిస్థితుల నేపధ్యంలో త్వరలో మొదలుపేట్టబోయే సినిమాల షూటింగ్ ను ఎలా కొనసాగిస్తాము అని తెలియచేసే ఒక వీడియోను విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందించి ముఖ్యమంత్రి కేసిఆర్ అపాయింట్ మెంట్ అడగడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 


షూటింగ్ లకు అనుమతులు ఇస్తే యూనిట్ సభ్యులమధ్య భౌతిక దూరం పాటిస్తూ ప్రతిరోజు షూటింగ్ స్పాట్ లో తమతోపాటు ఒక డాక్టర్ ను కూడ తమవద్ద పెట్టుకుంటామని ఎలాంటి సమస్యలు రాకుండా షూటింగ్ లు పూర్తి చేస్తామని హాలీవుడ్ లో కూడ ఇలాగే షూటింగ్ లకు అనుమతులు ఇస్తున్నారు అన్నవిషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికితీసుకు రాబోతున్నట్లు టాక్. అయితే ఈవిషయమై తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలు వేరుగా ఉన్నాయి అంటున్నారు. సినిమా షూటింగ్ లను బయట కాకుండా స్టూడియోలలో మాత్రమే కొన్నినెలలు కొనసాగించమని పరిస్థితులు అన్నీ పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాత మాత్రమే సినిమాలకు సంబంధించి అవుట్ డోర్ షూటింగ్స్ కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉండగా గతంలో  పాత సినిమాలలో  దేశభక్తి పై ఒకపాట విధిగా పెట్టినట్లుగా కరోనా ప్రస్తావన తీసుకువస్తూ దానిపై యుద్ధం చేయడానికి జనం ఎలా సమాయుక్తం కావాలో వివరిస్తూ తమ సినిమాలలో పాటలు కూడ పెట్టే ఆలోచనలు  చేయాలని చాలమంది భావిస్తున్నట్లు తెలుస్తోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: