తెలుగు సినిమాకు సాహసం అంటే ఏంటో చూపించిన స్టార్ హీరో సూపర్‌ స్టార్ కృష్ణ. వెండితెర మీద ఎన్నో ప్రయోగాలు చేసిన కృష్ణ తొలి కౌబాయ్‌ చిత్ర హీరోగా తెలుగులో రికార్డ్ సృష్టించాడు. మోసగాళ్లకు మోసగాళ్లు సినిమాతో తొలి కౌబాయ్ సినిమాలో హీరోగా నటించి తెలుగు హీరో గారి సంచలనం సృష్టించాడు కృష్ణ. కేయస్‌ ఆర్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమానిధి వేట నేపథ్యం లో తెరకెక్కింది. కృష్ణ సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ ‌పై ఈ సినిమాను రూపొందించాడు.

 

అప్పటికే హాలీవుడ్‌ లో వచ్చిన ద గుడ్‌ ద బ్యాడ్ అండ్‌ ద అగ్లీ, ఫర్‌ ఏ ఫ్యూ డాలర్స్‌ మోర్‌, మెకనాస్ గోల్డ్ లాంటి సినిమాల ఇన్సిపిరేషన్ ‌తో ఈ సినిమాను రూపొందించారు. ఎక్కువగా రాజస్థాన్‌ లోని ఎడారి ప్రాంతంలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. తెలుగులో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను తరువాత ట్రెజర్‌ హంట్‌ పేరుతో ఇంగ్లీష్ ‌లోకి డబ్‌ చేసి రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

కథ విషయానికి వస్తే బ్రిటీష్‌ వాళ్లు బొబ్బిలి మీద దండెత్తేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు రావటంతో రాజ్యాధికారులు రాజ్య సంపదనంతా ఓ సీక్రెట్‌ ప్లేస్‌లో దాచిపెట్టి అందుకు సంబంధించిన తాళలను, నిధి వెళ్లే దారి రహస్యాన్ని సీక్రెట్‌ ఉంచుతారు. ఆ నిధి కోసం హీరోతో పాటు కొన్ని ముటాలు ప్రయత్నిస్తుంటాయి. ఈ నేపథ్యంలో హీరో ఈ నిధిని ఎలా చేజిక్కించుకున్నాడు, దుర్మార్గుల ఆట ఎలా కట్టించాడు అన్నదే మిగతా కథ. హాలీవుడ్‌ కథా కథనాలకు ఏ మాత్రం తీసిపోని ఈ సినిమా ఇంగ్లీష్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: