సూర్య.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరో. విలక్షణ నటుడిగా సూర్యకు మన దగ్గర కూడా అశేషమైన ఆదరణ ఉంది. అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సూర్య నటించే ప్రతీ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. గజిని, సెవెంత్ సెన్స్, రక్త చరిత్ర, యముడు, సింగం, సింగం2, బ్రదర్స్, 24 మొదలైన సినిమాల ద్వారా తెలుగులో కూడా సూర్య మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఒక్కొక్కసారి మన తెలుగు సినిమాలకు ధీటుగా సూర్య సినిమాలు కలెక్షన్స్ రాబడుతుంటాయి. ఇదిలా ఉండగా సూర్య ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే “ఆకాశం నీ హద్దురా” తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కావాల్సివుంది. కానీ దేశ వ్యాప్తంగా నెలకొనియున్న పరిస్థితుల కారణంగా ఈ చిత్రం వాయిదా పడాల్సి వచ్చింది.

 

అయితే ఒకప్పుడు తెలుగులో సూర్య సినిమాలకు డబ్బింగ్ తాను చెప్పకపోయినా పాత్రలను మరియు పరిస్థితులను అనుసరించి కొన్ని చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. అయితే అవి తక్కువే ఉంటాయి. బ్రదర్స్ సినిమాలో ఒక క్యారెక్టర్ కి తమ్ముడు కార్తీ డబ్బింగ్ చెప్పాడు. కానీ తమ్ముడు కార్తీ మాత్రం తెలుగులో డబ్ అయ్యే సినిమాలకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్తూ వస్తున్నాడు. సూర్య మాత్రం ఎక్కువగా ఆ సాహసం చేయలేకపోయాడు. అయితే ఇప్పుడు విడుదల కానున్న 'ఆకాశం నీ హద్దురా' చిత్రానికి కూడా సూర్య తెలుగులో డబ్బింగ్ చెప్పడం లేదట. దీనికోసం మన టాలీవుడ్ టాలెంటెడ్ యువ నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెబుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ లో సత్యదేవ్ వాయిస్ కి మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తమిళ సూర్య కి సత్యదేవ్ గొంతు అరువుగా ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే కనుక నిజమై సూర్య బాడీ లాంగ్వేజ్ కు కానీ సత్యదేవ్ వాయిస్ మాడ్యులేషన్ కు మ్యాచ్ కుదిరే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకి జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ట్రైలర్ మరియు సాంగ్స్ విశేష ఆదరణ సంపాదించుకున్నాయి. మరి సినిమా రిలీజ్ తర్వాత ఆకాశమే హద్దుగా సూర్య దూసుకుపోతాడేమో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: