నరసింహ... ఇండియన్ సినిమాలో ఈ సినిమా ఒక సంచలనం. రజని కాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పడయప్ప అనే తమిళ సినిమా అన్ని భాషల్లో డబ్బింగ్ అయి అది సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమా అప్పట్లో ఆస్కార్ కి కూడా వెళ్తుందా అనే విధంగా ఉంది అనేది వాస్తవం. ఈ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో ఉండే కొన్ని యాక్షన్ సీన్లు అన్నీ కూడా ప్రేక్షకులను మైమరిపించాయి. ఈ సినిమాలో విలన్ గా నటించిన రమ్యకృష్ణ నటన చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు. 

 

ఆమె నటన ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి కొలమానం లేదు అంటూ కొందరు వ్యాఖ్యానించారు. ఆమె నటన విషయంలో అప్పటి నుంచి కూడా దర్శక నిర్మాతలకు ఎన్నో అంచనాలు వచ్చాయి. ఆమె సినిమాల్లో ఆ సినిమా ఒక ది బెస్ట్ అంటూ చాలా మంది కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సినిమాకు ముందు రమ్యకృష్ణసినిమా తర్వాత రమ్యకృష్ణ అనే విధంగా ఆమె నటించి మెప్పించింది అనేది వాస్తవ౦ ఆ సినిమాలో ఆమె జీవించింది. ఇక మన తెలుగులో ఈ సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది డబ్బింగ్ సినిమా అయినా సరే ఈ సినిమా చాలా భాషల్లో సంచలనం సృష్టించింది అనేది వాస్తవం. 

 

సినిమా కోసం రజని కాంత్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఇక సినిమాలో నటించిన ఇతర నటులు కూడా తమ తమ పాత్రల్లో చాలా బాగా నటించారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశం అయితే ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఆ సీన్ లో రజని కాంత్ తో పాటుగా రమ్య నటన ఎంతో ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: